కొకొనట్ బర్ఫీ: కొబ్బరి తురుము, బెల్లం పొడి, యాలకుల పొడితో దీన్ని తయారుచేస్తారు. ముందుగా స్టవ్ పై బాణలి పెట్టుకుని కొబ్బరి పొడిని కొద్ది సేపు వేయించండి. సన్నని మంటపై సుమారు 5-10 నిమిషాలైనా వేయించాలి. కిందికి దించి దీనిలో యాలకుల పొడి వేయండి. దీన్ని పక్కన పెట్టేసి.. ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో బెల్లం వేసి స్టవ్ పై పెట్టాలి. ఇది చిక్కగా మారిన తర్వాత దీనిలో.. పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి బాగా కలపి దించేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బర్ఫీ ఆకారంలో కట్ చేయాలి. అంతే రుచికరమైన స్వీట్లు తయారైపోతాయి.