అబ్బాయిలు ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా... ఈ సమస్య బారిన పడినట్లే?

Published : Oct 20, 2022, 02:55 PM IST

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ కనపడుతుంది. చేతిలో సెల్లు లేకపోతే కనీసం ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నారు. ఇలా ప్రతి ఒక్కరు సెల్లుకు బానిసలుగా మారిపోయారని చెప్పాలి. అయితే సెల్లు ఎక్కువగా వాడటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అబ్బాయిలు అతిగా మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితిలో ఉంటాయి.  

PREV
15
అబ్బాయిలు ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా... ఈ సమస్య బారిన పడినట్లే?

మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉపయోగించే అబ్బాయిలు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంతానలేమి సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడించాయి.అబ్బాయిలు మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా వారిలో స్పెర్మ్ కౌంటు తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.
mo

25

కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు శారీరక శ్రమ లేకపోవడం, ఆహార లోపం మానసిక ఒత్తిడి కారణంగా ఎక్కువ శాతం మంది పురుషులు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు తెలియజేశారు.
 

35

ఈ విధంగా ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. ఇక దేశవ్యాప్తంగా 23 శాతం మంది అబ్బాయిలు ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అందుకే వీలైనంత వరకు మొబైల్ ఫోన్ వాడకం తగ్గించడం ఎంతో మంచిదని పలు అధ్యయనాలు సూచించాయి.
 

45

ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుకూలంగా అలాగే వాతావరణంలో మార్పులు కారణంగా,టెక్నాలజీ కూడా పెరగడంతో 4జీ సేవలే కాకుండా 5 జీ సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇలా టెక్నాలజీ పెరగడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చే రేడియేషన్ కూడా అధికమవుతుంది. ఈ క్రమంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా మనల్ని చుట్టుముడుతున్నాయని చెప్పాలి. 
 

55

ఇక చిన్న పిల్లలు కూడా మొబైల్ ఫోన్ అతిగా ఉపయోగించడం వల్ల వారి కంటి చూపు అలాగే వెన్ను పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.ఇక చిన్న పిల్లలకు ఇప్పటినుంచి మొబైల్ ఫోన్ ఇవ్వడంతో వారికి చదువుపై ఏకాగ్రత కూడా పూర్తిగా తగ్గుతుందని వీలైనంత వరకు పిల్లలకు మొబైల్ ఫోన్ దూరంగా ఉంచాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

click me!

Recommended Stories