నుదుటిపై ముద్దు పెట్టుకుంటే అర్థం ఏంటో తెలుసా..?

First Published | Oct 20, 2022, 2:20 PM IST

ప్రేమించుకున్న ఇద్దరు వ్యక్తులు ముద్దు పెట్టుకోవడం చాలా కామన్. ఈ ముద్దు కేవలం ప్రేమికుల మధ్యే కాదు.. స్నేహితులు, తల్లీ బిడ్డల మధ్య కూడా ఉంటుంది. 
 

ప్రేమ.. మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన అనుభూతి. అందుకే చాలా మంది ఒక వ్యక్తిపై ప్రేమను మాటల్లో చెప్పలేనప్పుడు ముద్దు రూపంలో చెప్తుంటారు. ఈ ముద్దు కేవలం ప్రేమికుల మధ్యే కాదు.. తల్లిదండ్రులు, స్నేహితుల మధ్య కూడా ఉంటుంది. అయితే ప్రేమను కొందరు మాటల్లో చెప్తే.. ఇంకొందరు హగ్ రూపంలో చెప్తుంటారు. ఇంకొంతమంది పెదాలు, చేతులు, నుదురు మొదలైన వాటిని ముద్దు పెట్టుకుని ప్రేమను వ్యక్తపరుస్తారు. నుదుటిపై ముద్దును ఒక్క భాగస్వామికి మాత్రమే కాదు స్నేహితులకు కూడా పెడుతుంటారు. మనస్తత్వశాస్త్రం ప్రకారం.. అసలు నుదిటిపై ముద్దు పెట్టుకుంటే ఏం అర్థం వస్తుందో తెలుసుకుందాం.. 

మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అనేక నివేదికల ప్రకారం.. నుదుటిని ముద్దు పెట్టుకోవడం మరింత భావోద్వేగంగా ఉంటుంది. నుదుటిపై ముద్దుకు చాలా అర్థాలున్నాయి.


సన్నిహిత సంబంధం: నుదుటిపై ముద్దు పెట్టుకోవడం సన్నిహిత సంబంధాన్నిసూచిస్తుంది. దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తులే ఇలా నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు. అంటే ఇద్దరి మధ్య బంధం పెరిగేకొద్దీ.. తన భాగస్వామిపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఆలా ముద్దు పెడతారన్న మాట. అంటే పెదవులపై ముద్దు పెట్టుకునే ముందు ఇలా చేస్తారట.

Image: Getty Images

ఒత్తిడిని తగ్గిస్తుంది : ముద్దు నొప్పిని కూడా తగ్గుస్తుంది.  ఒక వ్యక్తి నొప్పితో బాధపడుతున్నప్పుడు కౌగిలించుకుని, నుదిటిపై ముద్దు పెట్టే సన్నివేశాలను మీరు చూసే ఉంటారు. మీకు తెలుసా.. నుదుటిపై ముద్దు పెట్టుకుంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. నొప్పి నుంచి కాస్త ఉపశమనాన్ని కలిగిస్తాయి.
 

Image: Getty Images

ఆనందం, గర్వానికి సూచిక: తల్లిదండ్రులు కూడా పిల్లలను ఎక్కువగా నుదుటిపైనే ముద్దు పెట్టుకుంటారు.  ఇంటికి చాలా కాలం పాటు దూరంగా ఉండే పిల్లలు తిరిగి ఇంటికి వస్తే ముందుగా చేసే పని నుదిటిపై ముద్దు పెట్టుకోవడం. ఇది సంతోషానికి సూచిక. తల్లిదండ్రులు గర్వపడేలా, గొప్ప పనులు చేసినప్పుడు వారి సంతోషాన్ని ఇలా తెలియజేస్తారు కూడా. దీనిని తల్లిదండ్రుల ఆశీర్వాదంగా కూడా భావించొచ్చు.
 

ప్రేమను వ్యక్తీకరించే విధానం:  మీ లైఫ్ పార్టనర్, తల్లిదండ్రులు కాకుండా మీ సన్నిహితులు మీతో ప్రేమలో ఉంటే కూడా ఇలా మీ నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు. ఇది ఇద్దరి మధ్య బంధాన్ని పెంచుతుంది. మీ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునే వ్యక్తులకే మీ నుదిటిని ముద్దు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. నేను నీతో ఉన్నాను.. నీ విజయాన్ని చూసి నాకెంతో ఆనందంగా ఉంది అనే విషయాన్ని ఇలా నుదిటిపై ముద్దు పెట్టుకుని చెప్పొచ్చు. 


పెదవికి బదులుగా నుదుటిపై ముద్దు పెట్టుకునేటప్పుడు: అయితే మీరు మాత్రం మీ పార్టనర్ కు లిప్ కిస్ ఇచ్చి.. వారు తిరిగి మీ నుదిపై ముద్దు పెడితే.. కాస్త అనుమానించాల్సిందే.. మరీ ముఖ్యంగా ఎప్పుడూ ఇలాగే జరిగితే మీ భాగస్వామికి మీ పై ఇంట్రెస్ట్ లేదనే అర్థం వస్తుంది. దీని గురించి వాళ్లతో మాట్లాడటం మంచిది. 
 

Latest Videos

click me!