Health Tips: రాత్రిపూట అన్నం తినకూడదా..?

Published : May 17, 2022, 04:23 PM IST

Health Tips: అన్నం లో కేవలం కార్బోహైడ్రేట్లతో పాటుగా కొన్ని రకాల పోషకాలు ఉంటాయి. వీటివల్ల మన శరీరానికి ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా రాత్రిపూట అన్నం తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే..   

PREV
17
Health Tips: రాత్రిపూట అన్నం తినకూడదా..?

మన దేశంలో అన్నానికి ప్రత్యేకస్థానం ఉంది. దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు కూడా. అందులోనూ ఇప్పటికీ మన దేశంలో మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. ఇక ఈ అన్నంతో జీరా రైస్, ఫ్రైడ్ రైస్, చోలే  రైస్ అంటూ రకరకాలుగా చేసుకుని తింటుంటారు. 
 

27

అన్నంతో కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు,  మెగ్నీషియం, కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. అయితే చాలా మంది రాత్రిపూట అన్నానికి బదులుగా రొట్టె తినడమే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఇంతకీ రాత్రిపూట ఎందుకు అన్నం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

37
rice

రాత్రి అన్నం తినడం వల్ల కలిగే బెనిఫిట్స్.. 

బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఈ కార్బోహైడ్రేట్ల వల్ల మన రోజూ వారి పనులను చకచకా చేసుకోవచ్చు. అంతేకాదు ఇవి మన శరీరాన్ని బలంగా తయారుచేస్తాయి. 

47

కడుపు ఆరోగ్యానికి.. మన ఉదరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అన్నం ఎంతో సహాయపడుతుంది. మంచిగా ఉడికిన అన్నం తినడం వల్ల అది తొందరగా అరగడంతో పాటుగా అజీర్థి, కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అందుకే కడుపు నొప్పి సమస్య ఉంటే అన్నంలో కాస్త పెరుగు వేసుకుని తినమని సలహానిస్తుంటారు. 
 

57

జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరం.. అన్నం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. అన్నంలో ఉండే పోషకాలన్నీ శరీర భాగాలను ధ్రుఢంగా తయారుచేస్తాయి. 

67

రాత్రి అన్నం తినొచ్చ? లేదా? .. మంచి చేసే ప్రతి ఆహారం ఎంతో కొంత దుష్ఫ్రభావాలను కూడా కలిగిస్తుందని అందరికీ తెలుసు. అలాగే అన్నం కూడా అంతే. అన్నం తినడం వల్ల ఎలా అయితే ఆరోగ్య ప్రయోజనాలున్నాయో నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

77

ముఖ్యంగా వెయిల్ లాస్ అవ్వాలనుకునే వారు రాత్రిపూట అన్నం అస్సలు తెలియకూడదు. తప్పదు అనుకుంటే వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను తీసుకోండి. దీనివల్ల మీకు ఫైబర్ పుష్కలంగా అందుతుంది. అలాగే ప్రోటీన్లు కూడా అధికంగా అందుతాయి. ఫైబర్ బరువు తగ్గించే ప్రాసెస్ ను ఫాస్ట్ చేస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories