ఇలా చేసే అబ్బాయిలను అమ్మాయిలు ఇట్టే ఇష్టపడతారు..!

First Published | May 17, 2022, 4:03 PM IST

పురుషులు డ్రెస్సింగ్ స్టైల్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకునే పురుషుల పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు.

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. కానీ.. తెలిసి ఇంప్రెస్ చేయడం కాదు.. కానీ.. తెలిసీ తెలియకుండా చేసే కొన్ని పనులు.. అమ్మాయిలకు బాగా నచ్చేస్తాయట. మరి ఎలాంటివి చేస్తే అమ్మాయిలకు తెగ నచ్చేస్తుందో ఓసారి చూసేద్దామా..

పురుషులు తమ మహిళల కురులు సరిచేయడం లాంటివి చేస్తే.. వారికి బాగా నచ్చేస్తుందట. ఇలా చేయడం వల్ల.. వారిపై ప్రేమ తెలియజేస్తుందట. తమను అంత ప్రేమగా చూసుకుంటున్నారని  అనుకుంటారట.


 ఇద్దరి మధ్య బంధం బలపడటానికి కూడా ఇది కారణమౌతుందట.  అలా జుట్టు సరిచేస్తున్నప్పుడు ఇద్దరి కంటిచూపులు కలుస్తాయట. ఇది చాలా మనోహరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. శాస్త్రీయంగా, కంటి చూపు ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పెంచుతుంది.

పురుషులు తక్కువ ప్రయత్నాలు చేస్తే, అది స్త్రీలను మరింత ఆకర్షిస్తుంది. ఇది విచిత్రంగా అనిపించవచ్చు, కానీ మొదట తక్కువ శ్రద్ధ లేదా కృషిని ఇచ్చే వారి పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని పరిశోధనలో తేలింది. పురుషులు ఎంత తక్కువ చేస్తే, వారు ఎక్కువ శ్రద్ధ పొందుతారు.

ఒక స్త్రీ గమనించే ప్రధాన విషయాలలో పురుషుల డ్రెస్సింగ్ స్టైల్ ఒకటి.  కాబట్టి... పురుషులు డ్రెస్సింగ్ స్టైల్ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. డ్రెస్సింగ్ స్టైల్ తో ఆకట్టుకునే పురుషుల పట్ల అమ్మాయిలు ఎక్కువగా ఆకర్షితులౌతూ ఉంటారు.

ఇక సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉన్న పురుషులను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట. పురుషులు హాస్యభరితమైన జోకులు పేల్చినప్పుడు మహిళలు ఇష్టపడతారు. నవ్వించేవారిని అందరూ ఇష్టపడతారు. అయితే.. తమను కంఫర్ట్ గా ఉంచే జోకులు వేసే అబ్బాయిలను వారు ఎక్కువగా ఇష్టపడతారు.

Latest Videos

click me!