Health Tips: శరీర వేడిని తగ్గించే చిట్కాలివిగో..

Published : May 17, 2022, 03:43 PM IST

Health Tips: వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మందిని వేధించే ప్రధాన సమస్య శరీరంలో వేడి పెరగడం. దీనివల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు (Bladder infections) వచ్చే అవకాశం ఉంది. అయితే  కొన్ని సింపుల్ టిప్స్ తో ఒంట్లో వేడిని ఇట్టే తగ్గించుకోవచ్చు. 

PREV
18
Health Tips: శరీర వేడిని తగ్గించే చిట్కాలివిగో..

వేసవిలోనే శరీరంలో విపరీతంగా వేడి పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మండుతున్న ఎండలు ఒకవైపు, దీనికి తోడు తీవ్రమైన ఉక్కపోతలు, ఈ ఎండలకు ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం, మసాలా ఆహారాలను ఎక్కువగా తినడం, కారం, ఉప్పు, మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, శరీరానికి సరిపడా నీళ్లను తాగకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోతుంది. అవేంటంటే.. 
 

28

మెంతులు.. మెంతులు వేడిని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం.. మీ రోజువారి వంటల్లో టేబుల్ స్పూన్ మెంతులను వేయండి. మెంతుల్లో శరీరానికి చలువ చేసే గుణం ఉంటుంది. 

38

అలొవెరా.. అలొవెరా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని జ్యూస్ ను రెగ్యులర్ గా తాగితే ఒంట్లో వేడి తగ్గిపోతుంది. అలొవెరా గుజ్జును నుదుటికి అప్లై చేసినా.. వేడి తగ్గుతుంది. 
 

48

బార్లీ వాటర్.. బార్లీ వాటర్ లో శరీర వేడిని తగ్గించే గుణం ఉంటుంది. రోజుకు రెండు పూటలా బార్లీ వాటర్ తాగితే వేడి నుంచి మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.  

58

కొబ్బరి నీళ్లు.. ఎండాకాలంలో శరీరం చల్లగా ఉండాలంటే మాత్రం రెగ్యులర్ గా కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం, మజ్జిగ వంటివి తాగాలి. ఈ పానీయాల్లో చలువ చేసే లక్షణాలుంటాయి. 
 

68
Poppies

గసగసాలు.. గసగసాల్లో చలువ చేసే లక్షణాలుంటాయి. ప్రతిరోజూ రెండు పూటల ఒక టీ స్పూన్ గసగసాలను నమిలితే శరీర ఉష్ణోగ్రత ఇట్టే తగ్గిపోతుంది. అలా అని మోతాదుకు మించి మాత్రం తినకూడదు. 

78

కీరా.. కీరాల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇది శరీర వేడిని కూడా తగ్గిస్తుంది. వీటిని అలాగే తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. 

88
​ ​

చల్లనీళ్లతో.. ఈ సీజన్ లో ఎన్ని సార్లు స్నానం చేసినా తక్కువే.. తీవ్రమైన ఉక్కపోతలకు శరీరంలో విపరీతంగా వేడి పెరుగుతుంది. అయితే రోజుకు రెండు మూడు సార్లు చల్లని నీళ్లతో స్నానం లేదా 30 నుంచి 40 నిమిషాలు ఈత కొట్టినా ఒంట్లో వేడి ఇట్టే తగ్గిపోతుంది. 

click me!

Recommended Stories