బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగుతున్నారా? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

First Published Oct 29, 2022, 3:48 PM IST

బీట్ రూట్ లో ఆక్సలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీరానికి ఎన్నో విధాలుగా హాని చేస్తుంది. అందుకే దీన్ని రోజూ తాగడం అంత సేఫ్ కాదని నిపుణులు చెబుతున్నారు. 
 

బీట్ రూట్ జ్యూస్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని ఎన్నో విధాలుగా కాపాడుతాయి. బీట్ రూట్ జ్యూస్ ను తాగితే శరీరంలో రక్తం పెరుగుతుంది. అలాగే తక్షణ శక్తి కూడా లభిస్తుంది.  దీనిలో ఉండే విటమిన్ బి, విటమిన్ సిలు ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అంతేకాదు దీనిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. అంతేకాదు ఈ జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా కరిగిస్తుంది. గర్భిణులు దీన్ని తాగడం వల్ల కడుపులో బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతాడు. ఈ జ్యూస్ చర్మ సమస్యలను పోగొడుతుంది. ఇది మెమోరీ పవర్ ను కూడా పెంచుతుంది.అయితే దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే ఆక్సలేట్ మాత్రం మనకు హాని కలిగిస్తుంది. అందుకే దీన్ని మోతాదులోనే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల కలిగే దుష్ప్రభవాలేంటో తెలుసుకుందాం పదండి. 

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం

బీట్ రూట్ లో ఎక్కువ మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది. ఒక వేళ మీకు ఇది వరకే కిడ్నీల్లో రాళ్లు ఉంటే.. బీట్ రూట్ జ్యూస్ ను అసలే తాగడకండి. ఎందుకంటే దీనిలో ఉండే ఆక్సలేట్ రాళ్లను పెంచుతుంది. 

కడుపునకు మంచిది కాదు

కడుపునకు సంబంధించిన సమస్యలున్న వారు కూడా బీట్ రూట్ జ్యూస్ ను తాగకూడదు. ఎందుకంటే దీనిలో నైట్రేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుది. ఇది మీ సమస్యలను మరింత ఎక్కువ చేస్తుంది. అందుకే ఇలాంటప్పుడు బీట్ రూట్ జ్యూస్ ను తాగకపోవడమే మంచిది. 
 

కాలెయ సమస్యలు వస్తాయి
 
బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తినడం వల్ల కాలెయ సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే బీట్ రూట్ లో ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలెయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందులోనూ బీట్ రూట్ జ్యూస్ ను ఎక్కువగా తాగితే ఎముకలు బలహీనపడతాయి. ఎముకల సమస్యలు వస్తాయి. 

అనాఫిలాక్సిస్ సమస్య

బీట్ రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనాఫిలాక్సిస్ సమస్య వస్తుంది. అనాఫిలాక్సిస్ ఒక రకమైన అలెర్జీ. దీనివల్ల చర్మంపై దురద, వాపు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

click me!