డ్రై ఫ్రూట్స్ ను వేయించి తింటే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?

First Published Oct 29, 2022, 2:01 PM IST

చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను అలాగే లేదా నానబెట్టి తింటుంటారు. అయితే వీటిని ఇలా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే డ్రై ఫ్రూట్స్ ను సరైన పద్దతిలోనే తినాలి. 
 

దీపావళి పండుగకు చాలా మంది బాదం, జీడిపప్పు, ఖర్జూరాలు, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ కానుకగా ఇస్తుంటారు. ఇంకేముంది చాలా ఉన్నాయని ఇష్టమొచ్చినన్ని లాగిస్తుంటారు. నిజానికి డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో ముడి  డ్రై ఫ్రూట్స్ ను ప్రాసెస్ చేసిన బిస్కెట్లు , చిప్స్ కు బదులుగా చిరుతిండిగా తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. గింజల్లో ఎన్నో పోషకాలుంటాయి. అలాగే వీటిలో ఫైబర్, మంచి కొవ్వులు, ప్రోటీన్లకు ఏ కొదవా ఉండదు. వీటిని పచ్చిగా తినే బదులు కాల్చి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొంందుతారు తెలుసా?  అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

ఆరోగ్యానికి మంచివి

గింజలను కాకుండా వేరే ఆహార పదార్థాలను వేడి చేస్తే అందులో ఉండే సూక్ష్మజీవులు, మలినాలు నశిస్తాయి. ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం జరగదు. అందుకే  ఇప్పటి నుంచి గింజలను కూడా వేయించండి. అప్పుడే వాటికి అంటుకున్న సూక్ష్మజీవులు నశిస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా తప్పుతుంది. 
 

Latest Videos


సులభంగా జీర్ణం అవుతాయి

ముడి డ్రై ఫ్రూట్స్ తో పోలిస్తే.. వండిన ఆహారాలే చాలా తర్వగా జీర్ణం అవుతాయి. అందుకే డ్రై ఫ్రూట్స్ పెనంపై వేయించి తినండి.  ముడి విత్తనాలతో పోలిస్తే కాల్చిన విత్తనాలే జీర్ణవ్యవస్థకు ఎక్కువ మంచి చేస్తాయి. ఇవి కడుపు నొప్పి, ఎసిడిటీ, మలబద్ధకం వంటివి రాకుండా చేస్తాయి. 
 

nuts

టేస్టీగా అవుతాయి

వేయించడం వల్ల డ్రై ఫ్రూట్స్ మరింత టేస్టీగా అవుతాయి. అంతేకాదు ఈ గింజల సువాసన కూడా రెట్టింపు అవుతుంది. వీటిని నచ్చిన ఆహారాల్లో వేసుకుని కూడా తినొచ్చు. 
 

roasted nuts

విత్తనాలను ఎలా వేయించాలి

ముందుగా ఒక ఫ్లాట్ బేస్ ఉన్న పాన్ ను తీసుకుని స్టవ్ పై పెట్టండి. ఇది వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ను వేసి.. వెడల్పుగా అనండి. ఈ గింజలు ఒకదానిపై మరొకటి  ఉండకుండా చూసుకోండి. వీటిని వేయించడానికి ఆయిల్ అవసరం లేదు. తక్కువ మంట మీద 15 నిమిషాల పాటు వేయించండి. వేరుశెనగ, పిస్తా , వాల్ నట్స్ వంటి గింజలను వేయించడానికి 6 నుంచి 8 నిమిషాల టైం మాత్రమే పడుతుంది. కానీ బాదం పప్పులకు 15 నిమిషాల టైం పడుతుంది. అయితే  ప్రతి 30 సెకన్లకు ఒకసారి ఈ గింజలను కలుపుతూ ఉండండి. లేదంటే అవి సరిగా కాలవు. అలాగే వీటి అడుగు భాగం మాడిపతుంది. ఈ గింజలు కాలిన తర్వాత కిందికి దించి వేరే గిన్నెలోకి వెయ్యండి.  ఈ గింజలు చల్లారిన తర్వాత వీటికి కొంచెం తెల్ల ఉప్పు, మిరియాలు పొడిని కలపండి. వీటిని కంటైనర్ లో నిల్వ చేసుకుంటే చాలా వరకు పాడవవు. వీటిలోని పోషకాలు తగ్గకూడదంటే ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండకూడదు. అలాగే ఎక్కువసేపు వేయించకూడదని గుర్తుంచుకోండి. అలాగే  మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచే ఉప్పును మాత్రమే ఉపయోగించండి.

click me!