నిమ్మకాయను ఇలా వాడితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది..

First Published Oct 24, 2022, 11:56 AM IST

నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. ఈ నిమ్మకాయ షుగర్ పేషెంట్లకు మెడిసిన్ కంటే తక్కువేం కాదన్న ముచ్చట మీకు తెలుసా..? 
 

lemon

మనం ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో నిమ్మకాయ ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ సిట్రస్ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీన్ని కాలాలతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా తినాలని చెప్తుంటారు. నిమ్మపండులో కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు కూడా ఉంటాయి. దీనిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది మన శరీరాన్ని నిర్విశీకరణ చేయడంలో సహాయపడుతుంది కూడా. అంతేకాదు ఈ నిమ్మరసం షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అందుకే దీన్ని మధుమేహులకు దివ్య ఔషదం లాంటిదని అంటుంటారు. ఇందుకోసం నిమ్మకాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి. 

భోజనానికి ముందు..

షుగర్ పేషెంట్లు భోజనం చేయడానికి కొంత సమయం ముందు గ్లాస్ నిమ్మ కాయ నీళ్లలో రాతి ఉప్పును కలిపి తాగితే మంచిది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. అయితే ఏదో ఒక సమయంలోనో కాకుండా మీరు ఎప్పుడు భోజనం చేస్తే అప్పుడు ఇలా నిమ్మనీళ్లను తాగితే మీ ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. 
 

lemon

ఆహారంతో..

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇంతకంటే గొప్ప మార్గం ఇంకేమీ ఉండదేమో. ఎలా అంటే.. మీ భోజనంతో పాటును నిమ్మకాయను తినాలి. కూరగాయలు, కాయ ధాన్యాలు, మాంసాహారం లేదా లంచ్, డిన్నర్ వంటి ఎలాంటి సమయంలో అయినా.. వీటిపై నిమ్మరసం కలుపుకుని తినండి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశమే ఉండదు. 
 

స్నాక్స్ లో.. 

ఒక వేళ మీరు షుగర్ పేషెంట్లు అయితే.. మీరు తినే స్నాక్స్ లో నిమ్మరసం తప్పకుండా పిండుకుని తినండి. దీనివల్ల స్నాక్స్ కూడా బలే టేస్టీగా అవుతాయి. ముఖ్యంగా వేరుశెనగలో నిమ్మకాయను పిండుకుని తినడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

టీ లో.. 

ఉదయం, సాయంత్రం అంటూ రోజుకు రెండు లేదా మూడు పూటలా టీ తాగే అలవాటు చాలా మందికే ఉంటుంది. అయితే మీరు డయాబెటీస్ పేషెంట్ అయినట్టైతే.. మీరు తాగే బ్లాక్ టీ లేదా గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగండి. ఇది మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. అలాగే మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. 
 

సలాడ్ లో..

భోజనం చేసే టైంలో చాలా మంది సలాడ్ ను తీసుకుంటూ ఉంటారు. ఈ సలాడ్ కు తప్పనిసరిగా నిమ్మరసం కలపాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నిమ్మరసంలో ఉండే విటమిన్లు, పొటాషియం షుగర్ పేషెంట్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. 

click me!