ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హార్ట్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ గుండె జబ్బులు ఒక్కపెద్దవారిలోనే కాదు .. 25 నుంచి 30 ఏండ్ల యువత కూడా దీనిబారిన పడుతున్నారు. గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండెజబ్బులు రావడానికి పేలవమైన జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారాలే దీనికి అసలు కారణం. చాలా మంది ఫిట్ గా కనిపించినప్పటికీ.. ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో నటుడు సిద్ధార్ఘ్ శుక్లా, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ , సింగర్ కెకెతో సహా పలువురు ప్రముఖులు గుండెపోటుతో చనిపోయారు. అయితే గుండెజబ్బుల లక్షణాలను సకాలంలో గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. మీ గుండె ప్రమాదంలో ఉంటే.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం పదండి.