దీపావళి 2022: మీ ప్రియమైన వారికి దీపావళి శుభాకాంక్షలు ఇలా చెప్పండి..

First Published | Oct 24, 2022, 9:59 AM IST

చెడుపై మంచి, చీకటిపై వెలుగు ఎప్పుడూ విజయం సాధిస్తాయన్న దానికి గుర్తుగా ప్రతి ఏడాది దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ రోజే దీపావళి పండుగ. మరి ఈ సందర్భంగా స్నేహితులకు, బంధువులకు, కుంటుంబ సభ్యులకు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకుందాం పదండి.. 

diwali 2022

దీపాల పండుగనే దీపావళి అని కూడా పిలుస్తారు. ఇక ఈ రోజు చిన్న నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ టపాసులు పేలుస్తారు. ఇంటినంతా దీపాల కాంతులతో అలంకరిస్తారు. ఈ దీపావళి పండుగ హిందువులకు ఎంతో ప్రత్యేకమైంది. చెడుపై మంచి, చీకటిపై వెలుగు, నిరాశపై ఆనందం ఎప్పడూ విజయాన్ని సాధిస్తాయని ఈ పండుగ సందేశం.
 

diwali 2022

హిందూ పురాణాల ప్రకారం.. శ్రీ రాముడు 14 ఏండ్ల వనవాసం పూర్తి చేసుకుని.. రావణాసుడిని ఓడించి.. సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో అయోధ్యకు తిరిగి వస్తాడు. ఈ సందర్బాన్ని పురస్కరించుకునే అయోద్య ప్రజలు వేలాది దీపాలను వెలిగించారట. ఇక అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. 
 

Latest Videos


అయితే ఈ పండుగ సందర్భంగా లక్ష్మీదేవిని, గణపయ్యను, కుబేరిడిని కూడా పూజిస్తారు. ఈ పండుగ వేళ ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, ఇళ్లంతా కొవ్వొత్తులు, దీపాలతో అలంకరిస్తారు. అంతేకాదు కొత్త బట్టలను కూడా వేసుకుంటారు. ఈ దీపావళి సందర్భంగా మీ ప్రియమైన వారికి, కుటుంబ సభ్యులకు, బంధువులకు ఎలా విషెస్ చెప్పాలో తెలుసుకుందాం పదండి.. 
 

ఈ దీపావళి మన జీవితాలను.. భవిష్యత్తు గురించి కొత్త ఆశలతో, రేపటి కొత్త కలలలో నింపాలి.. ఎంతో ప్రేమతో.. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.. 

diwali 2022

ప్రేమ అనే దీపాన్ని వెళిగించి, దు:ఖం అనే టపాకాయలను పేల్చండి. 
సౌభాగ్యం అనే రాకట్ ను షూట్ చేసి, ఆనందం అనే పూల కుండులను వెలిగించండి..
మీకు, మీకు కుంటుంబ సభ్యులకు వెలుగుల దీపావళి శుభాకాంక్షలు.. 

diwali 2022

లక్షలాది దీపాల కాంతులే అంతులేని ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, సంవృద్ధితో, సంపదతో  మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తాయి. సురక్షితమైన, సంతోషకరమైన దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
 

ఈ దీపావళి రాకతో మీ జీవితంలో ఆనందం వెల్లివిరియాలి. ఈ కాంతుల  పండుగ మిమ్మల్ని  సమృద్ధి పథం వైపు నడిపించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ.. దీపావళి శుభాకాంక్షలు.. 
 

diwali 2022

రంగోలి రంగుల మాదిరిగానే.. ఈ దీపావళి మీ కోసం కొత్త చిరునవ్వులు, కొత్త ఆనందాలను, సంతోషాలను తెస్తుందని ఆశిస్తున్నాను. దీపావళి శుభాకాంక్షలు డియర్.. 
 

శాంతి , సంతోషం, సంవృద్ధి, మంచి ఆరోగ్యం, గొప్ప గొప్ప విజయాలు ఎప్పుడూ మీతో పాటే ఉండాలని కోరుకుంటున్నాను. దీపావళి శుభాకాంక్షలు
 

లక్ష్మీదేవి, గణేషుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండి.. సుఖ సంతోషాలు, సంపద, అంతులేని ఆనందంతో కలకలలాడాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు. 

click me!