మధుమేహులు ఈ కూరగాయలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి..

First Published | Jul 31, 2022, 2:09 PM IST

Diabetes: మధుమేహులు ఏవి పడితే అవి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే వీరు కొన్ని కూరగాయలను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

vegetables

ఈ రోజుల్లో చిన్న వయసు వారు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధి ఎన్నో ఇతర రోగాలకు దారితీస్తుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం చెడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఆందోళన, మానసిక అలసట. పేలవమైన జీవనశైలి కూడా ఈ వ్యాధికి కారణమవుతుంది. ఈ వ్యాధి ఒక సారి సోకితే జీవితాంతం మనల్ని వేధిస్తూనే ఉంటుంది. దీన్ని పూర్తిగా తగ్గించుకోలేం. మనం చేయాల్సిందల్లా దీన్ని నియంత్రణలో ఉంచుకోవడమే. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించలేకపోతే.. శరీరంలోని వివిధ అవయవాలపై ప్రభావం చెడు ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రకాల ఆహారాలను రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయి. వాటిని రోజు వారి ఆహరంలో చేర్చుకోవాలి. అవేంటంటే.. 

క్యారెట్లు

మధుమేహ వ్యాధిగ్రస్తులు క్యారెట్లు ఔషదంలా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇవి డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంటాయి. కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. క్యారెట్లను అలాగే లేదా సలాడ్ గా కూడా తీసుకోవచ్చు. 
 


బ్రోకలీ

ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మధుమేహులు బ్రోకలీని తీసుకోవచ్చు. దీనిలో ఫైబర్ కంటెట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రీ బయోటిక్ గా పనిచేస్తుంది. దీన్ని తింటే డయాబెటీస్ పేషెంట్లు ఆరోగ్యంగా ఉంటారు. 
 

టొమాటోలు

టొమాటోలు కూడా మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటాయి. టొమాటోను సూప్ గా లేదా కూరల్లో వేసుకుని తినొచ్చు. దీనిలో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచడంతో పాటుగా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

దోసకాయ

మధుమేహులు రోజుకు ఒక దోసకాయను తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. దీన్ని మధ్యాహ్నం లేదా రాత్రి పూట తినొచ్చు. దీనిలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉండేలా చేస్తుంది. డీహైడ్రేషన్ సమస్యను కూడా తొలగిస్తుంది. పొట్టను ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. 
 

బీన్స్

డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు బీన్స్ ను తప్పకుండా తినాలి. ఎందుకంటే దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయను రెగ్యులర్ గా తినొచ్చు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

Latest Videos

click me!