బిజీ లైఫ్ కారణంగా చాలా మంది పురుషులు తమ ఆరోగ్యం గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేసారు. ముఖ్యంగా పోషకాహారం తీసుకోకపోవడంతో.. ఎన్నో దీర్ఘాకాలిక అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. అయితే పురుషులను ఆరోగ్యంగా ఉంచడంలో అంజీర అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని రోజూ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.
అంజీర లో మెగ్నీషియం, విటమిన్ ఎ, ఐరన్, విటమిన్ బి1, విటమిన్ బి 2, సోడియం, పాస్ఫరస్, క్లోరిన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో పాలిఫినోల్స్, ఫ్లవనోయిడ్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి.
అంతేకాదు షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయట. అధికరక్తస్రావంతో బాధపడేవారికి అంజీర చక్కటి ఔషదం లా పనిచేస్తుంది. దీనిని ఉసిరిపొడితో కలిపి తీసుకుంటే.. రక్తహీనత తగ్గుతుంది. అంజీరా ఆకులను నీళ్లలో కాచిచల్లార్చి తాగితే పొడి దగ్గు, గొంతు నొప్పి తగ్గుతాయి.
కొంచెం తీయగా, కొంచెం వగరుగా ఉండే ఈ పండు పురుషుల్లో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అంజీరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్నిరెగ్యులర్ గా తినడం వల్ల అజీర్థి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మలబద్దకం సమస్యతో బాధపడేవారు ఈ పండును ఖచ్చితంగా తినాలి. దీన్ని తినడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడతాయి. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది.
బరువును తగ్గించడంలో కూడా అంజీర పండు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు అంజీరను తింటే ఎక్కువగా ఫుడ్ ను తీసుకోలేరు. ఆకలి కూడా అనిపించదు.
గుండె జబ్బులు తగ్గుతాయి
మన దేశంలో రోజు రోజుకు హార్ట్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా గుండె సమస్యలు పురుషులకే ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు ఇంటి ఫుడ్ కంటే బయట దొరికే ఆయిలీ ఫుడ్ నే ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల వారి శరీరంలో కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి.. గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
ఇలాంటి పరిస్థితిలో వీళ్లు ఆరోగ్యంగా ఉంచేందుకు అంజీర పండ్లు ఎంతో సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అధిక రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి.
అత్తి పండ్లను ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. వీటిని పచ్చిగా లేదా వండుకుని కూడా తినొచ్చు. అయితే చాలా మంది వీటిని డ్రై ఫ్రూట్స్ గా తింటుంటారు. ఈ పండ్ల ద్వారా పురుషులు బెనిఫిట్స్ ను పొందాలనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ ను నీళ్లలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినాలి. అది కూడా పరిగడుపున. రాత్రి పాలలో కలుపుకుని కూడా వీటిని తీసుకోవచ్చు.