షురగ్ పేషెంట్లు పనీర్ ను తినొచ్చా? ఒకవేళ తింటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందా? తగ్గిస్తుందా?

First Published Jan 9, 2023, 9:43 AM IST

డయాబెటీస్ పేషెంట్లు ఏవి తినాలి? ఏవి తినకూడదు? అన్న విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలి. లేకుండా ఏది పడితే అది తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగిపోతాయి. 
 

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ఏవి ఉండాలి? ఏవి ఉండకూడదు అన్నవిషయంపై ప్రత్యేక  శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్లు తినే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పకుండా చేర్చుకోవాలి. అలాగే కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఎందుకంటే కార్భోహైడ్రేట్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను బాగా పెంచుతాయి. ఇకపోతే పనీర్ దాదాపుగా ప్రతి భారతీయ ఇంట్లో ఉండే ఒక సాధారణ పదార్ధం. ఇది శాఖాహారుల ప్రోటీన్ కు మంచి మూలం. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. అందుకే దీన్ని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇదంతా బానే ఉన్నా.. మధుమేహులు ఈ పనీర్ ను తినొచ్చా? లేదా? అన్న దానిపై సందేహాలు కలుగుతుంటాయి. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పనీర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదేనా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పనీర్ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. షుగర్ పేషెంట్లు ఈ పనీర్ ను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు. ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ లో చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గిస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే ప్రభావాలను నియంత్రిస్తుంది. అందుకే ఇది డయాబెటిస్ ఉన్న వ్యక్తికి సరైన ఆహారం అంటున్నారు నిపుణులు. 
 

నిజానికి పనీర్ లో ఉండే ప్రోటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది.. అంటే ఇది క్రమంగా కార్బోహైడ్రేట్లను విడుదల చేస్తుంది. అంటే పనీర్ తిన్న తర్వాత చక్కెర స్పైక్ ఉండదు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కాటేజ్ చీజ్ మంచి చిరుతిండి.  ఇంకో విషయం ఏంటంటే.. ఈ పనీర్ లో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. కాని ప్రోటీన్లు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయపడుతుంది. పనీర్ వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయంటే.. 

పిల్లల మానసిక అభివృద్ధికి మంచిది

ముడి పనీర్ మెదడు అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. ముడి కాటేజ్ చీజ్ ను పిల్లలకు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో తినిపించాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి మానసిక అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఇది వారి శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 
 

 కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం 

పనీర్ లో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో పోరాడటానికి పన్నీర్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పనీర్ ను తినడం వల్ల వెన్నునొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

పనీర్ లో లినోలెయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. కొవ్వును వేగంగా కరిగించడానికి , జీవక్రియను పెంచేందుకు ఈ ఆమ్లం బాగా ఉపయోగపడుతుంది. పనీర్ ను తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఇది అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అంతేకాదు ఇది మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి, వేగంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్ రోగులు బరువు తగ్గడానికి పనీర్ బెస్ట్ ఫుడ్ అంటారు నిపుణులు. 

ఎముకలకు మంచిది

పనీర్ లో ప్రోటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్ డి, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో ఉండే క్యాల్షియం పరిమాణం శరీరానికి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది. ఇది ఎముకలు బలంగా ఉండటానికి తోడ్పడుతుంది. కాల్షియం దంత ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. 

click me!