విటమిన్ డి
విటమిన్ డి లోపం వల్ల ఎముకలు, దంతాలు బలహీనంగా అవ్వడమే కాదు ఇది నిద్రలేమికి కూడా దారితీస్తుంది. మన శరీరంలో విటమిన్ డి.. కాల్షియం శోషణకు సహాయపడుతుంది. ఈ విటమిన్ డి వల్లే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా పెరుగుతాయి. బలంగా ఉంటాయి. అంతేకాదు విటమిన్ డి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర విటమిన్ల మాదిరిగా. విటమిన్ డి కేవలం ఆహారాల ద్వారే కాదు సూర్య రశ్మి ద్వారా కూడా లభిస్తుంది. నిపుణుల ప్రకారం.. విటమిన్ డి లోపం కూడా నిద్రలేమికి కారణమవుతుంది. పాలు, పెరుగు, వెన్న, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉండే గుడ్డు పచ్చసొనలో కూడా విటమిన్ డి ఉంటుంది. చేపల్లో కూడా విటమిన్ డికి ఏ కొదవా ఉండదు. ముఖ్యంగా సాల్మన్ చేపలు విటమిన్ డికి మంచి మూలం. పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. కానీ పోషకాలు మాత్రం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే తృణధాన్యాలు, చిక్కుళ్లను తింటే కూడా విటమిన్ డిని పొందుతారు.