ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తోందా? ఈ వ్యాధి వల్లే కావొచ్చు..

Published : Oct 17, 2022, 03:10 PM IST

మనిషికి నిద్ర చాలా అవసరం. నిద్రతోనో ఎన్నో అనారోగ్య సమస్యలు పోతాయి. అలాగని ఎక్కువ సేపు పడుకోవడం కూడా ప్రమాదకరమే. రాత్రి తొందరగా పడుకున్నా.. ఉదయం లేవడానికి మీకు బద్దకంగా అనిపిస్తుందా.. అయితే మీకు ఈ సమస్యలు ఉన్నట్టే.. 

PREV
16
ఉదయం లేవగానే అలసటగా అనిపిస్తోందా? ఈ వ్యాధి వల్లే కావొచ్చు..
tiredness

మనం ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర అవసరం కాదు అత్యవసరం. ఎందుకంటే నిద్రతోనే మన శరీరం తిరిగి శక్తివంతంగా, రీఫ్రెష్ గా మారుతుంది. అలాగని ఎక్కువ నిద్ర అసలే మంచిది కాదు. కానీ కొంతమంది ఎప్పుడూ సోమరిగానే కనిపిస్తారు. కానీ ఎప్పుడు చూసినా నిద్రమబ్బుగానే ఉంటే.. అది ప్రమాదకరమైన రోగానికి సంకేతం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉదయం ఎంత టైం అయినా మీరు ఇంకా సోమరిగానే నిద్రపోతే మాత్రం.. ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవేంటంటే..  

26

డైసానియా అంటే ఏమిటి?

డిస్మానియా అనేది నిద్రలేమి సమస్య కాదు. ఇది రాత్రిపూట నిద్రపోతే తగ్గిపోయేది కాదు. దీనిని Sleep inertia లేదా అలసట అని పిలుస్తారు. దీనివల్ల మంచం నుంచి లేవడానికి చాలా టైం పడుతుంది. అంటే వీరికి మంచంపై నుంచి లేవాలనిపించదు. అలాగే నిద్రపోవాలనిపిస్తుంది. దీనిలో మేల్కొని.. మళ్లీ అప్పుడే పడుకుంటారు. ఈ రకమైన నిద్ర చాలా అలసటను కలిగిస్తుంది.
 

36

బద్ధకపు నిద్రకు కారణమయ్యే ఇతర అనారోగ్య సమస్యలు

గుండె జబ్బులు:  ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువ అలసట గుండె సమస్యకు దారితీస్తుంది. ఇలాంటి వ్యక్తులు కూడా మంచం నుంచి లేవడానికి అస్సలు ఇష్టపడరు. స్మోకింగ్, ఓవర్ వెయిట్, అధిక రక్తపోటు లేదా అధిక కొలెస్ట్రాల్ లు కలిగున్నవారికి ఊపిరితిత్తుల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కూడా అలసటగా అనిపిస్తుంది.
 

46

నిద్రలేమి:  ఒక అధ్యయనం ప్రకారం.. నిద్రలేమిలో 80 రకాలు ఉంటాయి. ఈ నిద్రలేమిలో ఏదైనా ఒకటి డైసానియాను ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఉదయం లేవాలనిపించదు. శరీరంలో శక్తి అంతా తగ్గిపోయి.. అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. 

56

డిప్రెషన్..  డైసానియా, ఆందోళనతో ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే డిప్రెషన్ వల్ల అస్సలు నిద్రపట్టదు. నిద్ర లేకపోవడం కూడా డిప్రెషన్ లక్షణమే. డిప్రెషన్ కారణంగా సరిగ్గా నిద్రపోరు. దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది. డిప్రెషన్ వల్ల అప్పుడప్పుడు అలసట కలుగుతుంది. ఎన్నో అనారోగ్య  సమస్యలు వస్తాయి. 

66

ಆದಾಗ್ಯೂ, ನೆನಪಿನಲ್ಲಿಟ್ಟುಕೊಳ್ಳಲು ಕೆಲವು ಮುನ್ನೆಚ್ಚರಿಕೆಗಳಿವೆ, ನಿಮ್ಮ ಮನೆಗಳಲ್ಲಿ ಪುಲಾವ್ ಎಲೆಗಳನ್ನು ಸುಡುವಾಗ  ಎಲೆಗಳನ್ನು ಸರಿಯಾಗಿ ಗಮನಿಸಿ. ಒಮ್ಮೆ ಎಲೆಗಳು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸುಟ್ಟುಹೋದ ನಂತರ ನೀವು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಕಿಡಿಯನ್ನು ನಂದಿಸುತ್ತೀರಿ ಎಂದು ಖಚಿತಪಡಿಸಿಕೊಳ್ಳಿ . ಇಲ್ಲವಾದರೆ ಕಿಡಿ ಹೆಚ್ಚಿ ಬೆಂಕಿ ಬರುವ ಸಾಧ್ಯತೆ ಇದೆ. 

 థైరాయిడ్

మీకు హైపోథైరాయిడిజం లేదా హాషిమోటో వ్యాధి వంటి థైరాయిడ్ రుగ్మత ఉంటే కూడా చాలా కాలంగా అలసటను ఫేస్ చేస్తారు. దీనిని హాషిమోటోస్ థైరాయిడిటిస్ అని పిలుస్తుంటారు. హాస్పటల్ కు వెళ్లకపోతే ఈ అలసట నెలలు, సంవత్సరాలు కూడా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories