Poisonous Plants: ఇంట్లో పొరపాటున కూడా పెంచ కూడని మొక్కలు, ఇవి విషంతో సమానం

Published : Aug 04, 2025, 10:37 AM IST

 ఇండోర్ మొక్కలు  ఇంటికి అందాన్ని ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యానికి కూడా మంచిది అనే  భావన చాలా మందిలో ఉంటుంది. కానీ, మనకు హాని చేసే మొక్కలు కూడా ఉంటాయి.

PREV
17
Indore plants

ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అందంగా మార్చుకోవాలని అనుకుంటారు. దానికోసం చాలా మంది తమ ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటారు. ఇవి ఇంటికి అందాన్ని తీసుకురావడమే కాకుండా, వాతావరణాన్ని చల్లగా ఉంచుతాయి. గాలిని శుద్ధి చేయడం వంటి అనేక లాభాలను కలిగిస్తాయి. అంతే కాదు, ఈ మొక్కలను ఇంట్లో ఉంటే, ఆరోగ్యానికి కూడా మంచిదనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ.. కొన్ని ఇండోర్ ప్లాంట్స్.. మనకు పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడతాయి. ముఖ్యంగా అలెర్జీలు, శ్వాస సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు, పెంపుడు జంతువులకు ప్రమాదకరంగా మారొచ్చు. అందుకే, కొన్ని రకాల మొక్కలను పొరపాటున కూడా పెంచకూడదు. అవి విషంతో సమానం. మరి, ఆ మొక్కలేంటో చూద్దామా...

27
1. ఇంగ్లీష్ ఐవీ (English Ivy):

ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. చాలా తొందరగా పాకుతుంది కూడా. ఇంట్లో పెట్టుకుంటే... చూడటానికి చాలా అందంగా కనపడుతుంది. అందుకే.. చాలా మంది ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు. కానీ, ఇది ఫంగల్ స్పోర్లు విడుదల చేస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యలు, ఉబ్బసం, అలెర్జీకి కారణమవుతుంది. ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలున్నవారు దీని నుండి దూరంగా ఉండాలి.

37
2. కాక్టస్ (Cactus):

వాస్తు శాస్త్రం ప్రకారం కాక్టస్ మొక్క ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకురావచ్చు. దీని ముళ్ళు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెంచుతాయి. ఉద్రిక్తతను, ఒత్తిడిని కూడా పెంచుతాయని నమ్ముతారు. అంతేగాక, ఈ మొక్క తాకినప్పుడు గాయపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇళ్లలో కాక్టస్ పెట్టడం మంచిది కాదు.

47
3. ఒలియాండర్ (Oleander):

ఒలియాండర్ ఒక అందమైన పుష్ప మొక్క. అయితే ఇది అత్యంత విషపూరితమైన మొక్కల్లో ఒకటి. దాని ఆకులు, పువ్వులు, కొమ్మలు అన్నీ మనుషులతో పాటు , పెంపుడు జంతువులకు కూడా హాని చేస్తాయి. ఈ మొక్కను పొరపాటున ముట్టుకున్నా, నోట్లో పెట్టుకున్నా విషం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల, ఈ మొక్కను ఇంటి బయటనే పెంచడం మంచిది.

57
4. రబ్బరు మొక్క (Rubber Plant):

ఈ మొక్క చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే దాని కొమ్మల నుండి వచ్చే పేణి (latex) చర్మానికి హాని కలిగించవచ్చు. ఇది చర్మం మీద అలెర్జీలు, ఎరుపు, మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. పిల్లలు లేదా పెంపుడు జంతువులు దానిని తాకినప్పుడు చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

67
5. పీస్ లిల్లీ (Peace Lily):

పీస్ లిల్లీ గాలిని శుద్ధి చేసే గొప్ప మొక్క. కానీ దీని ఆకులు , పువ్వులు కొన్ని రకాల అలెర్జీలకు కారణమవుతాయి. పెంపుడు జంతువులు దీన్ని నమిలితే విష ప్రభావం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ సమస్యలు, జలుబు, ముక్కు ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.

77
6. కలబంద (Aloe Vera):

సాధారణంగా కలబందను ఆరోగ్యానికి ఉపయోగకరమైన మొక్కగా భావిస్తారు. కానీ దీనిని సరిగ్గా చూసుకోకపోతే, ఇది కుళ్లిపోతుంది. అలాంటి సమయంలో బ్యాక్టీరియా, ఫంగస్ వంటి హానికరమైన సూక్ష్మజీవులు పెరుగుతాయి. అవి గాలి ద్వారా వ్యాపించి ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. ముఖ్యంగా బాత్‌రూం లాంటి తడిగా ఉండే ప్రదేశాల్లో ఈ మొక్కను పెంచితే మరింత విషం గా మారే ప్రమాదం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories