Telugu

మొక్కలు బాగా పెరగాలంటే ఇలా చేయండి!

Telugu

పండ్ల తొక్కలు

పండ్ల తొక్కలు.. మొక్కలు బాగా పెరగడానికి సహాయపడతాయి. కొన్ని పండ్ల తొక్కలను తీసుకొని నీటిలో నానబెట్టండి. రెండు రోజుల తర్వాత దాన్ని మొక్కలకు వేయండి. 

Image credits: Getty
Telugu

టీ బ్యాగ్

టీ బ్యాగ్ లో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీన్ని మట్టిలో వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి. అయితే చక్కెర కలిపిన టీ పొడి వేయకూడదు.

Image credits: Getty
Telugu

బియ్యం కడిగిన నీరు

బియ్యం కడిగిన నీరు, బియ్యం ఉడికిన నీరు మొక్కల పెరుగుదలకు చక్కగా పనిచేస్తుంది. ఆ నీటిలో అనేక పోషకాలు ఉంటాయి.

Image credits: Getty
Telugu

కాఫీ పొడి

కాఫీ పొడిలో నత్రజని, పొటాషియం, భాస్వరం వంటివి ఉంటాయి. ఇది మట్టికి మంచిది. దీనివల్ల మొక్కలు బాగా పెరుగుతాయి.

Image credits: Getty
Telugu

బంగాళదుంప తొక్క

బంగాళదుంప తొక్కలో పొటాషియం, ఐరన్ ఉంటాయి. ఇది మొక్కలకు మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది.

Image credits: Getty
Telugu

గుడ్డు పెంకులు

గుడ్డు పెంకులను మొక్కలకు ఎరువుగా వాడవచ్చు. ఇందులో కాల్షియం కార్బోనేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మొక్కలు వాడిపోకుండా కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

పసుపు

మొక్కలకు చీడపీడలను నివారించడానికి పసుపు మంచిది. దీని యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మొక్కల వేర్లను రక్షిస్తాయి. మట్టిలో కొద్దిగా పసుపు చల్లితే సరిపోతుంది.

Image credits: Getty

మీ ఆఫీస్ టేబుల్ కు గ్రీన్ టచ్ కావాలా? ఈ మొక్కలు సరైన ఎంపిక!

Aloe Vera: కలబందతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!

Gardening Tips: జూలై నెలలో పెంచడానికి అనువైన మొక్కలు ఇవే!

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు.. దెబ్బకి కీటకాలు పరార్..!