Hair Growth: జట్టు బారుగా, ఒత్తుగా పెరగాలంటే..మీరు తినే ఫుడ్ లో ఇదొక్కటి పెడితే చాలు

Published : Nov 26, 2026, 03:08 PM IST

Hair growth: పిల్లలు కరివేపాకును పక్కన పెడుతున్నారా? అయితే ఈసారి దాంతోనే అదిరిపోయే బిర్యానీ చేసి చూడండి. రుచికి రుచి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాకుండా జుట్టు బాగా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. వెరైటీ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

PREV
15
ఇకపై కరివేపాకు పడేయలేరు..

పిల్లలు భోజనం చేసేటప్పుడు కరివేపాకు తీసి పక్కన పెట్టడం అన్ని ఇళ్లలో జరిగేదే. కానీ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కరివేపాకు పిల్లల జుట్టు పెరుగుదలకు, కంటిచూపుకు చాలా అవసరం. వాళ్లు దాన్ని పక్కన పెట్టకుండా ఇష్టపడి తినేలా చేయడానికి కరివేపాకును రుబ్బి కమ్మటి కరివేపాకు బిర్యానీ చేసి పెట్టండి. కూరగాయలు కూడా వేయడం వల్ల లంచ్ బాక్స్‌కి మంచి రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం.

25
కావాల్సిన పదార్థాలు

రుబ్బడానికి:

కరివేపాకు – 1 గుప్పెడు

పుదీనా ఆకులు – 1 గుప్పెడు

అల్లం – 1 ముక్క

వెల్లుల్లి – 10 రెబ్బలు

పోపు వేయించడానికి:

నెయ్యి – 1 స్పూన్

వంట నూనె

చెక్క, లవంగాలు, యాలకులు, రాతిపువ్వు

పెద్ద ఉల్లిపాయలు – 2

టమోటాలు – 1 లేదా 2

పసుపు – ¼ స్పూన్

కారం – 1 స్పూన్

ధనియాల పొడి – 2 స్పూన్లు

గరం మసాలా పొడి – 1 స్పూన్

గట్టి పెరుగు – ½ కప్పు

బిర్యానీ తయారీకి:

జీరక సాంబ బియ్యం – 1 గ్లాసు

క్యారెట్లు – 2

ఉడికించిన పచ్చి బఠానీలు

నీళ్లు – 1½ గ్లాసు

ఉప్పు

35
స్టెప్ 1

ఒక మిక్సీ జార్‌లో అల్లం, వెల్లుల్లి, గుప్పెడు పుదీనా, గుప్పెడు కరివేపాకు వేసి నీళ్లు పోయకుండా బరకగా రుబ్బుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి నెయ్యి, నూనె వేసి వేడి చేయాలి. అందులో చెక్క, లవంగాలు, యాలకులు లాంటి మసాలా దినుసులు వేసి వేయించాలి.

45
స్టెప్ 2

తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత టమోటాలు వేసి బాగా మగ్గేలా వేయించాలి. ఉల్లిపాయలు, టమోటాలు మగ్గాక, రుబ్బి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి వేయించాలి. ఆ తర్వాత ½ కప్పు గట్టి పెరుగు వేసి, నూనె పైకి తేలే వరకు బాగా కలపాలి. మసాలాలో నూనె పైకి తేలాక, తరిగిన క్యారెట్లు, ఉడికించిన పచ్చి బఠానీలు వేసి 2 నిమిషాలు వేయించాలి.

55
స్టెప్ 3

ఒక గ్లాసు బియ్యానికి 1½ గ్లాసు చొప్పున నీళ్లు పోసి, తగినంత ఉప్పు కలపాలి. నీళ్లు బాగా మరిగేటప్పుడు, అరగంట నానబెట్టి నీళ్లు వడకట్టిన జీరక సాంబ బియ్యాన్ని వేసి నెమ్మదిగా కలపాలి. కుక్కర్ మూతపెట్టి, స్టవ్‌ను చిన్న మంట మీద ఉంచి కచ్చితంగా 10 నిమిషాలు దమ్ చేసి దించాలి. ఆరోగ్యకరమైన, గుమగుమలాడే కరివేపాకు బిర్యానీ సిద్ధం. దీనికి నంజుకోవడానికి పెరుగు పచ్చడి లేదా బంగాళదుంప వేపుడు పెట్టి పిల్లల లంచ్ బాక్స్‌లో పంపొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories