Airport: భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విమానాశ్రయం ఏదో తెలుసా? ఎంత ఎత్తులో ఉంటుందో తెలుసా?

Published : Nov 26, 2026, 01:31 PM IST

Airport: మన దేశంలో చాలా ఎయిర్ పోర్ట్స్ ఉన్నాయి. కానీ, అత్యంత ఎత్తైన ఎయిర్ పోర్టు ఏదో తెలుసా? విమానం దిగి బయటకు వచ్చే సరికి.. మీరు పదివేల అడుగుల ఎత్తులో ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి అనుభూతిని ఇచ్చే ఎయిర్ పోర్టు ఎక్కడ ఉందో తెలుసా?

PREV
13
విమానాశ్రయం..

సాధారణంగా మనం ఏదైనా హిల్ స్టేషన్ కి వెళ్లాలి అంటే ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత గంటల తరబడి ఘాట్ రోడ్లలో ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ, భారతదేశంలోని ఒక అద్భుతమైన విమానాశ్రయంలో మాత్రం.. మీరు విమానం దిగి బయటకు అడుగుపెట్టగానే నేరుగా హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటారు. చుట్టూ మంచు కొండలు, కనువిందు చేసే లడఖ్ ప్రకృతి అందాల నడుమ సముద్ర మట్టానికి 3,256 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ విమానాశ్రయం ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

23
అత్యంత ఎత్తైన విమానాశ్రయం...

లడఖ్ లోని కుషోక్ బుకుల రింపోచే విమానాశ్రయం భారతదేశంలోనే అత్యంత ఎత్తైన వాణిజ్య విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం, ఇది సముద్ర మట్టానికి 3,256 మీటర్లు అంటే 10,682 అడుగుల ఎత్తులో ఉంది. లేహ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయం, లడఖ్ ను సందర్శించే పర్యాటకులకు ప్రధాన వాయు మార్గ కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఎయిర్ పోర్టు పేరు పెద్దగా ఉండటం వల్ల.. దీనిని అందరూ దానిపేరుతో కాకుండా.. లేహ్ పట్టణానికి దగ్గరగా ఉందని ఆ పేరుతోనే పిలుస్తూ ఉండటం విశేషం.

లేహ్ విమానాశ్రయం అంత ఎత్తులో ఎందుకు ఉంది?

ఈ ఎయిర్ పోర్టు లడఖ్ హిల్ స్టేషన్స్ లో ఉన్న లేహ్ పట్టణానికి సమానమైన ఎత్తులో నిర్మించారు. దీని వల్ల దేశంలోని ఇతర విమానాశ్రయాలతో పోలిస్తే, ఇక్కడ గాలి సాంద్రత కాస్త తక్కువగా ఉంటుంది. ఇక.. ఇక్కడ విమానం దిగిన వెంటనే చాలా ఎత్తులో ఉన్నాం అనే విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. అందుకే, ఇక్కడి వాతావరణానికి శరీరం అలవాటు పడేందుకు కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఈ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత వెంటనే ప్రయాణం చేయలేరు. ఒకరోజు రెస్ట్ తీసుకొని, ఆ తర్వాతే పక్కనే ఉన్న ప్రాంతాలు చూడటానికి వెళ్తుంటారు.

33
ఈ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత చూడాల్సిన ప్రదేశాలు...

శాంతి స్తూపం (Shanti Stupa): లేహ్ పట్టణపు అందమైన విహంగ వీక్షణం కోసం ఇది ఎంతో ప్రసిద్ధి.

లేహ్ ప్యాలెస్ (Leh Palace): పట్టణానికి అభిముఖంగా ఉండే చారిత్రాత్మక తొమ్మిది అంతస్తుల రాజభవనం.

థిక్సే మొనాస్టరీ (Thiksey Monastery): ఈ ప్రాంతంలో అత్యంత గుర్తింపు పొందిన బౌద్ధ ఆరామాలలో ఒకటి.

మాగ్నెటిక్ హిల్ (Magnetic Hill): లేహ్-కార్గిల్ మార్గంలో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే ప్రదేశం.

సంగం పాయింట్ (Sangam Point): సింధు (Indus), జన్స్కార్ (Zanskar) నదులు కలిసే అద్భుతమైన చోటు.

నుబ్రా వ్యాలీ & పాంగాంగ్ సరస్సు: లేహ్ దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఇవి స్వర్గధామాలు.

విమానాశ్రయానికి సరికొత్త హంగులు..

ప్రస్తుతం ఈ విమానాశ్రయం భారీ స్థాయిలో ఆధునీకరణ (Expansion) పనులకు సిద్ధమవుతోంది. అదనపు చెక్-ఇన్ కౌంటర్లు, బ్యాగేజీ హ్యాండ్లింగ్ సౌకర్యాలు, అరైవల్ కరోసెల్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లతో కూడిన కొత్త మల్టీ-లెవల్ టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణ హితమైన చర్యలలో భాగంగా రూఫ్‌టాప్ సోలార్ పవర్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories