Dates: రోజూ ఉదయాన్నే 2 ఖర్జూరాలు రెండు నెలలు తింటే ఏం జరుగుతుంది?

Published : Nov 26, 2026, 02:57 PM IST

Dates: ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మరి, అలాంటి ఖర్జూరాలను ప్రతిరోజూ ఉదయాన్నే క్రమం తప్పకుండా రెండు నెలలు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా?

PREV
13
Dates

ఈ రోజుల్లో అందరిదీ ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. తీరిక లేని జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పెద్ద డైట్ ప్లాన్లు అవసరం లేదు. ప్రతిరోజూ ఉదయం కేవలం రెండు ఖర్జూరాలను తినడం లాంటి చిన్న అలవాటుతో శరీరంలో ఎన్నో మంచి మార్పులు కనిపిస్తాయి. సహజమైన తీపి, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండే ఖర్జూరాలను రెండు నెలల పాటు ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే శరీరంలో ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం...

23
జీర్ణక్రియకు, శక్తికి మంచి బూస్టర్

రెండు నెలల పాటు రోజూ ఉదయం రెండు ఖర్జూరాలు తింటే శరీర పనితీరులో మార్పు కనిపిస్తుంది. ఖర్జూరాలలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. దీనివల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. జంక్ ఫుడ్ లేదా స్వీట్లు తిన్నప్పుడు నీరసం వస్తుంది. అదే.. ఖర్జూరాలను తినడం వల్ల.. వీటిలో ఉండే సహజమైన తీపి.. రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు.

గుండె ఆరోగ్యానికి, రక్తహీనతకు మేలు

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం బీపీని అదుపులో ఉంచడానికి, గుండె కొట్టుకునే వేగాన్ని సరిగ్గా ఉంచడానికి సహాయపడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ తోడ్పడతాయి. అలాగే వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఐరన్, బీ విటమిన్లు రక్తహీనత ఉన్నవారికి చాలా మంచిది.

33
మరి షుగర్ ఉన్నవారికి ఎలా?

ఖర్జూరాలు తీపిగా ఉన్నా.. వీటి వల్ల రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరగదు. ఎందుకంటే వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ 42 నుంచి 55 మధ్య మితంగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ వల్ల షుగర్ నెమ్మదిగా రక్తంలోకి కలుస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు తక్కువ మోతాదులో తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. రెండు ఖర్జూరాలలో సుమారు 36 కేలరీలు, 9 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటాయి. వీటిని పెరుగు లేదా కొన్ని డ్రైఫ్రూట్స్‌తో కలిపి తింటే షుగర్ ఇంకా నియంత్రణలో ఉంటుంది. అయితే షుగర్ ఉన్నవారు వీటిని రోజూ తినే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

ఎవరికి మంచిది? ఎవరు జాగ్రత్త పడాలి?

రోజూ చురుగ్గా ఉండేవారికి, ఆటగాళ్లకు, రక్తహీనత ఉన్నవారికి, అలాగే ఎముకలు గట్టిగా ఉండటానికి కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ అవసరమయ్యే వృద్ధులకు ఖర్జూరాలు చాలా మంచిది. కానీ కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్య ఉన్నవారికి ఇందులోని తీపి వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు పొటాషియం ఎక్కువ కాకుండా చూసుకోవాలి, బరువు తగ్గాలనుకునేవారు కాస్త తక్కువ తినడం మంచిది. సాధారణంగా ఆరోగ్యంగా ఉండే పెద్దలకు రోజుకు రెండు ఖర్జూరాలు తినడం మంచిదే అయినా, ఏదైనా కొత్త అలవాటు మొదలుపెట్టే ముందు డాక్టర్ లేదా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories