మీ ఉద్యోగం తో పాటు రెండు గంటలు కష్టపడితే.. డబల్ ఇన్ కమ్

Published : Aug 11, 2025, 11:55 AM IST

ఉద్యోగం కారణంగా చాలా మంది తమ ఆసక్తులను చంపుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా చేసి ఉంటే.. ఇప్పుడు వాటితోనే మళ్లీ మీ ఆదాయం పెంచుకోవచ్చు.

PREV
14
ఆదాయం పెంచే మార్గాలు..

ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఎంత సంపాదించినా కూడా పెద్దగా ఏమీ మిగలడం లేదు. ఫస్ట్ తారీఖు వచ్చినా..ఈఎంఐలు, ఇంటి ఖర్చులు అయిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నా కూడా నెలాఖరు వచ్చే సరికి ఏమీ మిగలడం లేదు. ఈ సమస్యతో మీరు కూడా బాధపడుతున్నారా? అయితే... మీ రోజులో అదనంగా రెండు గంటల సమాయాన్ని కేటాయిస్తే.. మీ ఆదాయం రెట్టింపు చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు. రెండు గంటలు ఎక్కువగా కష్టపడితే సరిపోతుంది. ప్రతిరోజూ చేయలేకపోయినా వారానికి రెండు రోజులు చేసినా చాలు. మరి, మీ ఆదాయాన్ని రెట్టింపు చేసే పార్ట్ టైమ్ జాబ్స్ ఏంటో చూద్దామా...

24
బెస్ట్ పార్ట్ టైం జాబ్స్..

ఉద్యోగం కారణంగా చాలా మంది తమ ఆసక్తులను చంపుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా చేసి ఉంటే.. ఇప్పుడు వాటితోనే మళ్లీ మీ ఆదాయం పెంచుకోవచ్చు. లేదు.. మీకు ఏవైనా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నా.. వాటితోనూ మీరు మీ ఆదాయాన్ని పెంచుకొని, ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవచ్చు.

1.రాయడం,ఎడిటింగ్.. మీకు రాయడంలో కానీ, తప్పులు సవరించడంలో ఏ మాత్రం పట్టు ఉన్నా.. మీకు ఫ్రీలాన్సింగ్ దొరికినట్లే. బ్లాగ్ రాయడం, కథలు రాయడం, లేదా ఏదైనా వెబ్ సైట్ లో కంటెంట్ రాయడం, కాపీ రైటింగ్ లేదా ప్రూఫ్ రీడింగ్స్ జాబ్స్ బయట చాలా ఈజీగా దొరికేస్తాయి.

2.గ్రాఫిక్ డిజైన్... లోగో తయారు చేయడం, బ్రోచర్ డిజైన్, సోషల్ మీడియా గ్రాఫిక్స్

3. వెబ్ సైట్ డిజైన్.. చిన్న చిన్న కంపెనీలకు వెబ్ సైట్ డిజైన్ చేయవచ్చు. ఆల్రెడీ ఉన్న సైట్స్ ని కూడా మార్చే ఛాన్స్ కూడా ఉంటుంది. బయట అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శ్రమ తక్కువ.. ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది.

4.సోషల్ మీడియా నిర్వహణ - చిన్న వ్యాపారాల కోసం, చిన్న సెలబ్రెటీల కోసం సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించడం.

5.డేటా ఎంట్రీ- ఇది చాలా తక్కువ నైపుణ్యాలు అవసరమయ్యే సాధారణ ఉద్యోగం.

6.అనువాదం- మీకు ఒకటి కంటే ఎక్కువ భాషలు తెలిస్తే.

34
ఆన్‌లైన్ ట్యూషన్ లేదా కోచింగ్

మీరు ఏదైనా సబ్జెక్టులో నిపుణులా? అది గణితం, సైన్స్, భాష లేదా సంగీతం, కళ లేదా కోడింగ్ వంటి ప్రత్యేక నైపుణ్యం అయినా, మీరు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఇవ్వడం ద్వారా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు.

అకడమిక్ ట్యూషన్- పాఠశాల లేదా కళాశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ట్యూషన్స్ కూడా చెప్పొచ్చు.

పోటీ పరీక్షలకు కోచింగ్- JEE, NEET, UPSC, SSC వంటి పరీక్షలకు కోచింగ్ ఇవ్వడం ద్వారా కూడా సంపాదించొచ్చు.

నైపుణ్యం-ఆధారిత కోచింగ్- గిటార్, యోగా లేదా ఏదైనా సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్పించడం..

ఈ రోజుల్లో చిన్న చిన్న పనులు చేయడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశం ఇచ్చే అనేక ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. మీరు వాటిల్లో కూడా జాయిన్ అవ్వొచ్చు.

44
మీ దగ్గర వాహనం ఉంటే..

డెలివరీ భాగస్వామి- డెలివరీ పని చేయడం ద్వారా మీరు అదనపు ఆదాయాన్ని సంపాదించగల అనేక ప్లాట్‌ఫారమ్‌లు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. మీరు మీ వాహనాన్ని ఉపయోగించవచ్చు. మీ సౌలభ్యం ప్రకారం పని చేయవచ్చు.

రైడ్-షేరింగ్ – మీకు కారు ఉంటే, మీరు ఓలా లేదా ఉబర్‌తో భాగస్వామిగా ఉండవచ్చు. వీకెండ్స్ లో డ్రైవింగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

టాస్క్-ఆధారిత యాప్‌లు – కొన్ని యాప్‌లు మరమ్మతులు, శుభ్రపరచడం, పెంపుడు జంతువుల సంరక్షణ మొదలైన చిన్న ఇంటి పనులు చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.

చేతితో తయారు చేసిన ఉత్పత్తులు – మీరు పెయింట్ చేస్తే, నగలు తయారు చయడం, ఏదైనా కుట్టు, అల్లికల లాంటి స్పెషల్ టాలెంట్ ఉన్నా.. హ్యాపీగా ఎక్స్ ట్రా ఇన్ కమ్ సంపాదించుకోవచ్చు. వాటికంటూ స్పెషల్ పేజ్ క్రియేట్ చేసుకొని, వాటిని ఆన్ లైన్ లో అమ్మేస్తే సరిపోతుంది.

బేకింగ్/వంట – మీకు వంట చేయడం బాగా వస్తే.. చిన్న చిన్న ఆర్డర్స్ తీసుకోవచ్చు.

ఫోటోగ్రఫీ – మీకు ఫోటోగ్రఫీ పట్ల మక్కువ ఉంటే, మీరు ఈవెంట్‌లకు ఫోటోగ్రాఫర్‌గా మారవచ్చు

Read more Photos on
click me!

Recommended Stories