ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ తో డాక్టర్ దగ్గరకు వెళ్తే ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఏ మందులు ఎప్పుడు వేసుకోవాలో అందులో వివరిస్తారు. మందులు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వేసుకోమంటారు. కొందరు ఏదైనా తిన్న తర్వాత మందులు వేసుకోమంటారు. అయితే చాలా మంది ఇక్కడే తప్పులు చేస్తుంటారు.
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం చేసిన తర్వాత మందులు వేసుకోమని డాక్టర్లు సూచిస్తే.. చాలా మంది భోజనం తిన్న వెంటనే, కాస్త కూడా గ్యాప్ లేకుండా టాబ్లెట్స్ వేసేసుకుంటారు. ఇది చాలా తప్పు అని డాక్టర్లు చెబుతున్నారు. తిన్న తర్వాత అంటే భోజనం చేసిన కనీసం 15 నుంచి 20 నిమిషాల తర్వాత మందులు వేసుకోవాలని చెబుతున్నారు.
ఆహారం తిన్న వెంటనే టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు. తిన్న ఆహారమే అరకుండా వెంటనే టాబ్లెట్ వేసుకోవడం వల్ల అందులో ఉండే మెడిసన్ శరీరంలో సమస్య ఉన్న చోటకు సరిగా చేరుకోదని చెబుతున్నారు. దీని వల్ల సమస్య తగ్గకపోగా, ఇన్ డైజేషన్, ఎసిడిటీ లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
మరికొందరు రెండు, మూడు మాత్రలను ఒకేసారి మింగేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఒకేసారి రెండు, మూడు రకాల మందులు వేసుకోవడం వల్ల అవి కడుపులో కెమికల్ రియాక్షన్ కి గురై సరిగ్గా పనిచేయవని అంటున్నారు. దీని వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గకపోగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ప్రతి టాబ్లెట్ కి కనీసం 10, 15 నిమిషాల గ్యాప్ అవసరమని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి ఈ లక్షణాలు ఉంటే మీ శరీరంలో ఐరన్ తక్కువగా ఉందని అర్థం
కొందరు తలనొప్పి ఉందని, నీరసంగా ఉందని, కడుపుతో నొప్పిగా ఉందని డైరెక్ట్ గా మెడికల్ షాపుకు వెళ్లి టాబ్లెట్స్ తెచ్చేసుకుంటారు. అయితే దీర్ఘకాలంగా ఉండే ఇలాంటి ఆరోగ్య సమస్యలకు మెడికల్ షాపు వాళ్లు ఇచ్చే టాబ్లెట్స్ పనిచేయవని, డాక్టర్స్ చేసే పరీక్షల ద్వారా మాత్రమే కరెక్ట్ మెడిసన్ లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాల సమస్యలు ఉన్న వారు డాక్టర్స్ సలహా లేకుండా ఎలాంటి మెడిసన్ వాడకూడదని హెచ్చరిస్తున్నారు.