Humorists and Controversies జోకులు వేసి కోర్టుల చుట్టూ తిరుగుతున్న కమెడియన్లు!

అత్యత్సాహం, ఇతరులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం ఎప్పటికైన ప్రమాదకరమే. ఇలా జోకులేసి కొందరు కమెడియన్లు చిక్కుల్లో పడ్డారు. కామెడీతో కొందరు నవ్వులు పూయించినా అభ్యంతరకర వ్యాఖ్యలతో కోర్టులకెక్కారు. కునాల్ కామ్రా, రణవీర్ నుంచి మునవర్ ఫారూకీ దాకా ఎవరు ఎలా చిక్కల్లో పడ్డారో తెలుసుకుందాం.

Comedians in legal trouble indian humorists and controversies in telugu
కునాల్ కామ్రా

కునాల్ కామ్రా తన రాజకీయ జోకులకు ఫేమస్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై కామెంట్ చేయడంతో అతడిపై FIR నమోదైంది. 2020లో ఇండిగో, స్పైస్‌జెట్ అతన్ని బ్యాన్ చేశాయి.

Comedians in legal trouble indian humorists and controversies in telugu
రణవీర్ అలాహాబాదియా

రణవీర్ అలాహాబాదియా 'ఇండియాస్ గాట్ టాలెంట్' షోలో చేసిన ఒక అసభ్యకరమైన జోక్ వల్ల వార్తల్లో నిలిచాడు. అతనిపై FIR నమోదు అయింది. సుప్రీంకోర్టు అనుమతితో అరెస్టు నుండి రిలీఫ్ వచ్చింది.


మునావర్ ఫారూకీ

హిందూ దేవుళ్ల గురించి అభ్యంతరకరమైన జోకులు వేసినందుకు మునవర్ ఫారూకీని 2021లో అరెస్టు చేశారు. బెయిల్ వచ్చే వరకు ఒక నెల జైలులో ఉన్నాడు. కేసు ఇంకా నడుస్తోంది.

తన్మయ్ భట్

లతా మంగేష్కర్, సచిన్ టెండూల్కర్ లాంటి సెలెబ్రిటీలను స్నాప్‌చాట్‌లో అవమానించినందుకు తన్మయ్ భట్‌పై కేసు నమోదైంది. పరువు నష్టం, అశ్లీలత కింద కేసు వేశారు. ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. 

వీర్ దాస్

వీర్ దాస్ రాసిన 'రెండు భారత్‌లు' కవిత వివాదానికి దారితీసింది. భారతదేశంలోని  అతడు వాస్తవిక పరిస్థితులను చూపించాడు. దీనిపై కొందరు ఏకీభవించగా, మరికొందరు విమర్శించారు. అతనిపై ఫిర్యాదు చేశారు. కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది.

కికూ శారదా

కికూ శారదా 2016లో ఒక మత గురువును వెక్కిరిస్తూ అనుకరించినందుకు అరెస్ట్ అయ్యాడు. దీని వల్ల ప్రజల్లో ఆగ్రహం పెరిగింది. ఆ తర్వాత అతను క్షమాపణ చెప్పాడు. అయినా కేసు నమోదైంది.

Latest Videos

vuukle one pixel image
click me!