Coconut Water Benefits: ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. గుండె పోటు వంటి సమస్యలు కూడా రావు. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా వీటిని ఎక్కువగా తాగితే వెయిట్ లాస్ అవుతారు.
Coconut Water Benefits: ఎండాకాలం రాకతో ఒంట్లో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. నీటికొరత ఏర్పడితే.. మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఒక్కోసారి డీహైడ్రేషన్ తో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
29
ఎండాకాలం రాకతో కొబ్బరి నీళ్ల వాడకం విపరీతంగా పెరుగిపోతోంది. ఎండాకాలం వచ్చిందంటే చాలు పట్టణాల్లో, నగరాల్లో కొబ్బరి బోండాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వేసవి దాహాన్ని తీర్చడానికి కొబ్బరి నీళ్లు ఎంతో సహాయపడతాయి. వడదెబ్బ తగలకుండా ఉండటానికి కొబ్బరి నీళ్లను తప్పనిసరిగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
39
కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో చేరిన టాక్సిన్లను తొలగించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే లివర్ ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదు.
49
గుండె ఆరోగ్యానికి కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. ఈ కొబ్బరి నీళ్లతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి..
59
రక్తపోటు : రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే రోజుకు మూడు నాలుగు సార్లు కొబ్బరి నీళ్లను తాగాలని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.
69
గుండె ఆరోగ్యం: కొబ్బరి నీళ్లలో ట్రై గ్లిజరైడ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించే గుణముంటుంది. కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగితే.. హార్ట్ ఎటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం తగ్గుతుంది.
79
వెయిట్ లాస్: కొబ్బరి నీళ్లలో కార్బోహైడ్రేట్లు, షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్ అయ్యేందుకు చక్కటి డ్రింక్ అనే చెప్పాలి. కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
89
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొబ్బరి నీళ్లను తాగితే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కొవిడ్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను ఖచ్చితంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ కొబ్బరి నీళ్లు మరీ చల్లగా కూడా ఉండకూడదు. సాధారణ ఉష్ణోగ్రత వద్దే తాగాలని చెబుతున్నారు.
99
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది: కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలలో వాంతులు, విరేచనాలు కూడా ఉన్నాయి. ఈ సమస్యలు తలెత్తకూడదంటే.. కొబ్బరి నీళ్లను ఎక్కువగా తాగాలి. అంతేకాదు కొబ్బరి నీళ్లతో కడుపులో మంట, అల్సర్, పేగుల్లో మంట వంటి సమస్యలు కూడా రావు.