నోరూరించే వేడివేడి బైంగన్ పులావ్.. ఎలా చెయ్యాలంటే?

Published : Mar 21, 2022, 03:20 PM IST

ఎప్పుడైనా పులావ్ తినాలనిపిస్తే రొటీన్ గా చేసుకునే పులావ్ లకు బదులుగా కాస్త వెరైటీగా ఈ సారి బైంగన్ పులావ్ ను ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం బైంగన్ పులావ్ (Baingan Pulao) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..   

PREV
18
నోరూరించే వేడివేడి బైంగన్ పులావ్.. ఎలా చెయ్యాలంటే?
Baingan Pulao

కావలసిన పదార్థాలు: రెండు కప్పుల బాస్మతి బియ్యం, పది వంకాయలు (Brinjals), నాలుగు లవంగాలు (Cloves), రుచికి సరిపడా ఉప్పు (Salt), ఒక బిర్యానీ ఆకు (Biryani leaf), ఒక అనాసపువ్వు (Anasapuvvu), నాలుగు యాలకలు (Cardamom), ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క (Cinnamon), సగం స్పూన్ గరం మసాల (Garam masala), రెండు టేబుల్ స్పూన్ ల నెయ్యి (Ghee).
 

28
Baingan Pulao

పావుకప్పు నూనె (Oil), రెండు ఉల్లిపాయలు (Onions), రెండు టమోటాలు (Tomatoes), సగం స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ ధనియాల పొడి (Coriander powder), ఒక స్పూన్ గరం మసాలా (Garam masala), ఒక స్పూన్ బిర్యానీ మసాలా (Biryani masala), ఒక స్పూన్ కారం (Chili powder), సగం కప్పు పెరుగు (Yogurt).
 

38
Baingan Pulao

మసాలా కోసం: పావు కప్పు వేయించిన పల్లీలు (Fried pallis), పావు కప్పు వేయించిన ఉల్లిపాయ (Fried onions) ముక్కలు, సగం స్పూన్ పసుపు (Turmeric), ఒక స్పూన్ వెల్లుల్లి (Garlic) తరుగు, ఒక స్పూన్ ధనియాల పొడి (Coriyander powder), ఒక స్పూన్ కారం (Chili powder).
 

48
Baingan Pulao

తయారీ విధానం: ముందుగా అరగంట ముందు  బియ్యాన్ని నానబెట్టుకోవాలి (Soak the rice). తర్వాత మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న పల్లీలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ (Grind finely) చేసుకోవాలి.
 

58
Baingan Pulao

వంకాయలను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు వంకాయలకు గాట్లు పెట్టుకున్న తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న మసాలాను కూరాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో నెయ్యి (Ghee), నూనె (Oil) వేసి వేడి చేసుకోవాలి.
 

68
Baingan Pulao

నెయ్యి, నూనె కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, అనాసపువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత (After frying) ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, పెరుగు, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి గరం మసాలా, బిర్యానీ మసాలా, కారం వేసి బాగా కలుపుకోవాలి (Mix well).
 

78
Baingan Pulao

ఈ మసాలా (Masala) అంతా బాగా ఉడికిన తరువాత ఇప్పుడు ఇందులో మసాలా కూరిన వంకాయలు, అరగంట పాటు కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, మూడున్నర కప్పుల నీళ్ళు (Water) పోసి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
 

88
Baingan Pulao

కుక్కర్ ఆవిరి పోయిన తరువాత మూత తీసి తయారైన వేడివేడి బైంగన్ పులావ్ ను ప్లేట్ లో తీసుకొని సర్వ్ (Serve) చేయండి. అంతే ఎంతో రుచికరమైన నోరూరించే బైంగన్ పులావ్ రెడీ (Ready). మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి.

click me!

Recommended Stories