బరువు తగ్గి స్లిమ్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి..

Published : Mar 21, 2022, 02:33 PM ISTUpdated : Mar 21, 2022, 02:51 PM IST

నిత్య యవ్వనంగా తయారవ్వాలన్నా.. నలుగురిలో మీరే నాజుగ్గా కనిపించాలన్నా కొన్ని అలవాట్లను అస్సలు మార్చుకోకూడదు. ఆ అలవాట్ల వల్లే హీరోయిన్లు అంత నాజుగ్గా కనిపిస్తారట.   

PREV
111
బరువు తగ్గి స్లిమ్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి..

మనం తీసుకునే ఆహారం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉండే ఆహారాలను తీసుకోకూడదు. 

211

నలుగురిలో నాజూగ్గా కనిపించాలంటే నాన్ వెజ్ ను ఎక్కువగా తినకూడదు. మితంగా తీసుకుంటేనే మంచిది. అప్పుడే మీరు స్లిమ్ గా కనిపిస్తారు. 

311

తాజా పండ్లను, కూరగాయలను ఎక్కువగా తింటూ ఉండాలి. వీటితో ప్రోటీన్లు, ఖనిజాలు, శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. 

411

స్వీట్లకు వీలైనంత దూరంగా ఉండాలి. వీటిని ఎప్పుడో ఒకసారి తింటే ఏమీ ప్రాబ్లం లేదు కానీ.. తరచుగా తింటేనే వెయిట్ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి తీపి ఆహార పదార్థాలను ఎక్కువగా తినకండి. 

511

శరీరం ఫిట్ గా ఉండాలన్నా.. ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండాలన్నా.. క్రమం తప్పకుండా వ్యాయామాలను చేయాలి. 

611

ఫాస్ట్ ఫుడ్ మిమ్మల్ని ఎంత నోరూరించినా.. వాటిని మాత్రం తినకండి. ఫాస్ట్ ఫుడ్స్ తో లైఫ్ రిస్క్ లో పడుతుంది. సర్వరోగాలు మన చుట్టే ఉండే ప్రమాదం ఉంది. వీటికి వీలైనంత దూరంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

711

ప్రోటీన్లు, న్యూట్రిషయన్లు, ఖనిజాలు, లవణాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను రోజు వారి ఆహారంలో తీసుకుంటేనే మీ ఆరోగ్యం బాగుంటుంది. శరీరాకృతి  కూడా బాగుంటుంది.
 

811

డ్యాన్స్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో కదా.. డ్యాన్స్ తో శరీరక ఆరోగ్యమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. డ్యాన్స్ మిమ్మల్ని హుషారు చేస్తుంది. డ్యాన్స్ చేయడం వల్ల మీ శరీరాకృతి బాగుంటుంది. 

911

నీళ్లను మాత్రం నెగ్లెట్ చేయకూడదు. సీజన్లతో సంబంధం లేకుండా నీళ్లను తాగితేనే మీరు హెల్తీగా ఉంటారు. అలా అని నీళ్లను ఎక్కువ మొత్తంలో తాగకూడదు. అలా తాగితే శరీరంలో ఉండే పోషకవిలువలు బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. 

1011

మరువకుండా నిత్యం యోగాను చేయండి. యోగాతో మీరు శిల్పంలా అందమైన శరీరాకృతిని సొంతం చేసుకుంటారు.  కాబట్టి ప్రతిరోజూ కాసేపు సమయాన్ని కుదుర్చుకుని యోగాను చేయండి. 

1111

ప్రతి రోజూ కాస్త సమయాన్ని వెచ్చించి.. 20 నుంచి 50 గుంజిల్లను తీయండి. గుంజీలు పనిష్మెంట్ గానే తియ్యరు.. ఇది మంచి వ్యాయామం కూడా.  గుంజిల్లను తీయడం వల్ల తొడల దగ్గర కొవ్వు కరిగిపోతుంది. బెల్లీ ఫ్యాట్ పోతుంది. శరీరంలో కేలరీలు ఖర్చైపోతాయి. అంతేకాదు ఆహారం కూడా తొందరగా అరుగుతుంది. గుంజిల్లతో శరీరాకృతి బాగుంటుంది కూడా.. 
 

click me!

Recommended Stories