పెళ్లికాని ప్రసాదులు ... క్రెడిట్ స్కోరు బాగుంటేనే ఇళ్లయినా, ఇల్లాలయినా..!

Published : Jul 26, 2025, 10:51 AM IST

లక్షణంగా ఉన్నా, లక్షల్లో జీతం ఉన్నా సరే... సిబిల్ స్కోరు బాగోలేకుంటే పెళ్లికాని ప్రసాదుల జాబితాలో చేరాల్సివస్తోంది. పెళ్లి చూపుల్లో క్రెడిట్ రిపోర్ట్ చూసే నయా ట్రెండ్ మొదలయ్యింది. 

PREV
16
పెళ్లికాని ప్రసాదులు... సిబిల్ స్కోరు జాాగ్రత్త

Marriage : ప్రేమ రెండు మనసులను కలుపుతుంది... కానీ పెళ్లి రెండు జీవితాలను కలుపుతుంది. ప్రేమకు పెద్దగా పట్టింపులేవీ ఉండవు... ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడితే చాలు. కానీ పెళ్ళి అలాకాదు... రెండు కుటుంబాలు ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసుండాలి కాబట్టి పెళ్ళి విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.

DID YOU KNOW ?
పెళ్లిళ్ల కోసం ఇండియాలో ఇంతఖర్చా?
భారతీయులు పెళ్లిళ్ల కోసమే ఏటా రూ.10 లక్షల కోట్లు ఖర్చుచేస్తున్నారట. ఈ విషయంలోనూ చైనా తర్వాతిస్థానం మనదే. వరల్డ్ రిచ్చెస్ట్ కంట్రీ అమెరికా కూడా మనకంటే వెనకబడే ఉంది.
26
ఏడుతరాలు కాదు క్రెడిట్ స్కోర్ బాగుంటేచాలు

ముఖ్యంగా తమబిడ్డ జీవితాంతం ఆ ఇంట్లోనే ఉండాలి.. కాబట్టి ఆమెకు కాబోయే భర్త, అత్తామామలు ఇలా కుటుంబం గురించి పూర్తి వివరాలను తెలుసుకుంటారు ఆడపిల్లల తల్లిదండ్రులు. అందుకే పెళ్ళి చేసేముందే అటు ఏడుతరాలు, ఇటు ఏడుతరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇప్పుడు పెళ్లి ట్రెండ్ మారిపోయింది... ఏడుతరాలు కాదు కేవలం సిబిల్ రిపోర్ట్ చూస్తే చాలు అబ్బాయిల జాతకాలు బైటపడుతున్నాయి.

36
క్రెడిట్ స్కోరు బాగుంటేనే పెళ్లి...

సాప్ట్ వేర్ ఉద్యోగం... లక్షల్లో జీతం... లగ్జరీ లైఫ్... ఇక ఈ అబ్బాయికి తమ బిడ్డనిస్తే హాయిగా ఉంటుంది... ఇది ఒకప్పటి పేరెంట్స్ ఆలోచన. అందుకే సాప్ట్ వేర్ ఉద్యోగం అనగానే వెనకాముందు చూడకుండా భారీగా కట్నకానుకలతో పిల్లనిచ్చి పెళ్లిచేసేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి... లక్షల జీతమున్నా ఆర్థిక క్రమశిక్షణ లేకుంటే పిల్లనివ్వడానికి ఇష్టపడటంలేదు తల్లిదండ్రులు.

46
ఆర్థిక క్రమశిక్షణ గురించి ఎలా తెలుసుకోవడం?

కుర్రాడి ఉద్యోగం, సాలరీ వివరాలను పనిచేసే కంపెనీలో ఎంక్వైరీ చేస్తే తెలుస్తాయి... ఎలాంటివాడో చుట్టుపక్కల ఇళ్లవారు లేదా తెలిసినవారిని అడిగితే తెలుస్తుంది.. మరి ఈ ఆర్థిక క్రమశిక్షణ గురించి ఎలా తెలుసుకోవడం? అంటే దీనికి ఓ మార్గాన్ని కనిపెట్టారు ఈ జమానా పేరెంట్స్. అదే సిబిల్ రిపోర్ట్... ఒక్క పాన్ కార్డ్ తో అతడి ఆర్థిక లావాదేవీలన్నీ బయటకు లాగవచ్చు.

56
పెళ్లిచూపుల ట్రెండ్ మారిపోయిందిగా..

ఈ కొత్త రకం పెళ్లిచూపులు పెళ్లికాని ప్రసాదులను కలవరపెడుతున్నాయి. గతంలో తెలిసో తెలియకో ఆర్థిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించకుంటే అవిప్పుడు బైటపడి పెళ్లినే ఆపేస్తున్నాయి. సిబిల్ రిపోర్ట్ లో చెక్ బౌన్స్, క్రెడిట్ కార్డ్ సెటిల్ మెంట్స్, ఓవర్ డ్యూస్ వంటి వివరాలుంటే లక్షల జీతమున్నా సరే రిజెక్ట్ చేస్తున్నారట తల్లిదండ్రులు... ఆర్థికంగా క్రమశిక్షణ లేకుంటే జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది... అలాంటివాడి జీవితంలోకి తమ బిడ్డను పంపలేమని కరాకండీగా చెబుతున్నారట ఈ తరం పేరెంట్స్.

66
క్యారెక్టర్ కాదు క్రెడిట్ స్కోరు ఉండాలి...

గతంలో అబ్బాయి క్యారెక్టర్ బాగుండాలి... మంచి ఉద్యోగం, లక్షల్లో సాలరీ, కూర్చుని తిన్నా తరగనన్ని ఆస్తిపాస్తులు, చిన్న కుటుంబం ఉండాలి… ఇలాంటి ఇంటికి తమ బిడ్డను పంపాలని పేరెంట్స్ భావించేవారు. కానీ ఇప్పుడు క్యారక్టరే కాదు క్రెడిట్ స్కోరే ముఖ్యమంటున్నారు.

సాధారణంగా బ్యాంకులో లోన్స్ కోసం క్రెడిట్ స్కోరు చూస్తారు.. కానీ ఇప్పుడు పిల్లనిచ్చేందుకు చూస్తున్నారు. కొద్దిగా అటుఇటుగా సిబిల్ స్కోరు ఉంటే బ్యాంకులు కాస్త తక్కువయినా లోన్ ఇవ్వడానికి అంగీకరిస్తాయేమో గానీ అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం అలాకాదు... క్రెడిట్ స్కోర్ బాగోలేకుంటే వెంటనే సంబంధాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కాలం అబ్బాయిలు జాగ్రత్త... ముందునుండే మీ ఆర్థిక లావాదేవీలను సక్రమంగా నిర్వహించుకొండి... లేదంటే మీరుకూడా పెళ్లికాని ప్రసాదుల జాబితాలో చేరిపోతారు.

Read more Photos on
click me!

Recommended Stories