Coconut: హిందూ ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ పూజ అయినా, శుభకార్యం అయినా కొబ్బరికాయను ఉపయోగిస్తారు. ప్రతి పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టి పూజ ముగిస్తాం. అయితే.. కొబ్బరికాయ కొట్టే సమయంలో కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలేంటో తెలుసా?
హిందూ ధర్మంలో కొబ్బరికాయకు విశేష ప్రాధాన్యత ఉంది. ఏ పూజ లేదా శుభకార్యం అయినా కొబ్బరికాయను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఇది పవిత్రత, శుభత, సమర్పణను సూచిస్తుంది. దేవతలకి నైవేద్యంగా సమర్పిస్తారు.
26
కొబ్బరికాయ కొట్టడానికి కారణమదే?
కొబ్బరికాయ ప్రాముఖ్యత ముందుగా తెలుసుకోవాలి. హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయను "శ్రీఫలం" అని పిలుస్తారు. ఇది శుభకార్యాల్లో ప్రధానంగా ఉపయోగించబడే పవిత్ర ఫలం. కొబ్బరికాయ దేహం మానవ శరీరాన్ని ప్రతినిధీకరిస్తుందని భావిస్తారు. వెలుపల పెచ్చు శరీరాన్ని, లోపల ఉన్న తేలికపాటి నీరు మన ఆత్మను సూచిస్తాయి. ఈ కారణంగా దేవుడి ముందే మన ఆత్మ, మన ప్రాణం అర్పిస్తున్నాం అన్న భావనతో కొబ్బరికాయను కొడుతాం.
36
పురాణాల ప్రకారం కొబ్బరి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం.. విష్ణువు భూమికి అవతరించినప్పుడు ఆయనతో పాటు లక్ష్మీదేవి, కొబ్బరి చెట్టు, కామధేనువు కూడా భూలోకానికి వచ్చాయని చెబుతారు. అందుకే లక్ష్మీ దేవీ, కొబ్బరి చెట్టు, కామధేను లను సంపద, శుభత, శుద్ధతకు ప్రతీకలుగా పరిగణిస్తారు.
హిందూ ధర్మంలో కొబ్బరికాయను శ్రీఫలంగా పిలుస్తారు. “శ్రీఫల” అంటే “లక్ష్మీదేవి ప్రసాదంగా లభించే ఫలం”. కొబ్బరికాయలో బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని విశ్వసిస్తారు. కొబ్బరికాయపై ఉండే మూడు మచ్చలు త్రిమూర్తులకు సూచన. అలాగే కొబ్బరికాయపై ఉండే రంధ్రాన్ని శివుని తృతీయ నేత్రంతో పోల్చుతారు. అందుకే కొబ్బరిని పూజల్లో ఉపయోగిస్తారు.
56
కొబ్బరికాయ కొట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు
కొబ్బరికాయను పూజకు ముందు శుభ్రంగా కడిగి, పీచు ఉన్న చోట పట్టుకొని కొట్టాలి.
టెంకాయ కొట్టే రాయి ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండాలి. టెంకాయ సమంగా పగిలితే శుభసూచకంగా భావిస్తారు.
కొబ్బరి నీటిని ఒక గిన్నెలో తీసుకొని, టెంకాయ చిప్పల్లో పంచదార లేదా పటికబెల్లం వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా సమర్పిస్తే శుభం కలుగుతుందని నమ్మకం.
66
శుభ సూచనలు & ఫలితాలు:
శుభ సూచనలు
కొబ్బరికాయ తెల్లగా ఉండటం, పువ్వు రావడం, తీర్థం తియ్యగా ఉండటం శుభ సూచకాలు.
కొత్తగా పెళ్లైనవారు కొట్టిన టెంకాయలో పువ్వు ఉంటే సంతానప్రాప్తి జరగవచ్చని నమ్ముతారు. టెంకాయ నిలువుగా పగిలితే కూతురు లేదా కొడుక్కు సంతానం లభించవచ్చని విశ్వాసం.
అశుభ పరిస్థితులు :
పగిలిన టెంకాయ కుళ్లిపోయి ఉంటే దానిని పారవేసి, చేతులు కాళ్లు కడుక్కొని మళ్లీ పూజ చేయాలి.