కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని మిస్ చేయకుండా తినండి..

Published : Dec 19, 2022, 11:50 AM IST

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల ప్రమాదకరమైన హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారం, రెగ్యులర్ గా వ్యాయామం చేస్తే.. చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.   

PREV
17
 కొలెస్ట్రాల్ తగ్గాలంటే వీటిని మిస్ చేయకుండా తినండి..
high cholesterol

కొలెస్ట్రాల్ మన కాలేయం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది మన శరీరంలో వివిధ హార్మోన్లు, కణ త్వచాలు, నరాల రక్షణను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే రసాయనం. ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను పెరగడానికి మనం తీసుకునే ఆహారమే ప్రధాన కారణం. అయితే కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. చెడు (ఎల్డిఎల్ - తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్), మంచి (హెచ్డిఎల్ - అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) ఈ రెండు కొలెస్ట్రాల్ లు ఉంటాయి. 

27
High Cholesterol

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల రక్త నాళాలలో ఫలకం ఏర్పడుతుంది. ఇది అవయవాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా గుండెకు. దీంతో గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వంటి రోగాలు వస్తాయి. మొత్తంగా ఈ చెడు కొలెస్ట్రాల్ మనల్ని అర్థాంతరంగా చంపేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.

37
High Cholesterol

అయితే రక్త ధమనుల నుంచి హానికరమైన కొలెస్ట్రాల్ ను తొలగించడానికి మంచి కొలెస్ట్రాల్ ఎంతో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

47
High Cholesterol

ఎర్ర మాంసం, జున్ను, కాల్చిన వస్తువులు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలల్లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. వీటిలో కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పెరిగిన ఎల్డిఎల్ స్థాయిల వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు. దీనివల్ల ఎక్కడలేని రోగాలు చుట్టుకుంటాయి.  అయితే డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా  పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

57
High Cholesterol

జీవక్రియ రేటు తగ్గడం, ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం ఈ రెండూ హైపోథైరాయిడిజం ప్రభావాలు. కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధుల ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. పాలిసిస్టిక్ అండాశయ రుగ్మత వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

67

జీవనశైలి మార్పులు: చెడు కొలెస్ట్రాల్ కరగడానికి  కొన్ని రకాల ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..

బాదం, వాల్ నట్స్ వంటి గింజలు

సిట్రస్ పండ్లు

స్ట్రాబెర్రీలు

ద్రాక్ష, ఆపిల్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు -బీన్స్, కాయధాన్యాలు

సోయా, సోయా ఆధారిత ఆహారాలు

సాల్మన్ వంటి కొవ్వు చేపలు

కిడ్నీ బీన్స్

ఓట్స్

బార్లీ, తృణధాన్యాలు

వంకాయ 
 

77
cholesterol

కొలెస్ట్రాల్ స్థాయిలను ఎలా తగ్గించాలి?

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో ఆటోమెటిక్ గా చెడు కొలెస్ట్రాల్ కరగడం మొదలవుతుంది. 

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. 

బరువు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. 

కొలెస్ట్రాల్, సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. 

కొన్ని సందర్భాల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవడానినకి మందులను కూడా వాడాల్సి ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories