ఖర్జూరాలను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు.. ఈ సమయాల్లో తింటేనే ఆరోగ్యానికి మంచిది..

First Published Oct 7, 2022, 2:53 PM IST

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వీటిని ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. వీటిని తినడానికంటూ ఒక సమయం ఉంటుంది. అప్పుడు తింటేనే మీరు దీని ప్రయోజనాలను పొందుతారు. 
 

dates

ఈ రోజుల్లో రోగం లేని మనిషి లేడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చిన్నదో పెద్దదో.. ఏదో ఒక సమస్యతో బాధపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులువు కాదు. శరీరానికి అవసరమైన పోషకాలను తీసుకుంటూ.. జాగ్రత్త గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇక ఈ రోజుల్లో డయాబెటీస్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడం, మధుమేహం, దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి చాలా మంది చక్కెరను తీసుకోవడం తగ్గించారు. చక్కెరకు బదులుగా ఖర్జూరాలను ఉపయోగిస్తూ ఉంటారు. నిజానికి ఈ ఖర్జూరాలను ఉపవాస సమయంలోనే ఎక్కువగా తింటూ ఉంటారు. ఖర్జూరాలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 

dates

ఆయుర్వేదం ప్రకారం..  ఖర్జూరాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఖర్జూరాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఇనుము కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఖర్జూరాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు తగ్గుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఖర్జూరాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది మెడిసిన్ లా పనిచేస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు, కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్ పుష్కలంగా ఉంటాయి.

dates

మలబద్ధకాన్ని నివారిస్తుంది: ప్రతిరోజూ ఖర్జూరాలను తినడం వల్ల గట్ సరిగ్గా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని నివారించడానికి ఖర్జూరాలు ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో కరిగే, కరగని ఫైబర్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఖర్జూరాలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే శీతాకాలంలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రతిరోజూ ఖర్జూరాలను తీసుకోవడం వల్ల గుండె పోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చు. 
 

కొలెస్ట్రాల్ నియంత్రణ:  ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో  పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుంతుంది. 

ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: ఖర్జూరాల్లో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఖర్జూరాలు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి.

 లైంగిక శక్తిని పెంచుతాయి:  వివాహిక జీవితంలో సెక్స్ లైఫ్ చాలా అవసరం. అయితే కొందరికి సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అలాంటి వారు వీటిని తింటే మంచిది. ఎందుకంటే ఇవి ఇద్దరిలో లైంగిక శక్తిని పెంచుతాయి. 
 

అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది: పని లేదా మరేదైనా కారణం వల్ల అలసిపోయినట్టుగా అనిపిస్తే  లేదా బలహీంగా ఉంటే వెంటనే ఖర్జూరాలను తినండి. అలసట తగ్గుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. 

రక్తహీనత నియంత్రణ:  ఖర్జూరాల్లో ఉండే ఐరన్ కంటెంట్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

ఆరోగ్యంగా బరువు పెరగడం: రోజుకు 4 ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువు పెరుగుతారు.  

పైల్స్ ను నివారిస్తుంది:  ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ పైల్స్ ను కూడా తగ్గిస్తుంది. 

ఖర్జూరాలను ఏ సమయంలో తినడం మంచిది

ఖర్జూరాలను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం భోజనంలో తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలనుకుంటే నిద్రపోయే సమయంలో నెయ్యితో పాటు ఖర్జూరాలను తినండి. రోజుకు 4 సార్లు ఇలా తింటే మీరు ఆరోగ్యంగా బరువు పెరగడమే కాదు మీ జీర్ణక్రియ  కూడా బాగుంటుంది. 
 

ఖర్జూరాలను ఎందుకు నానబెట్టాలి?

ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతారు. ఎందుకంటే వాటిలో ఉండే టానిన్ లు ఫైటిక్ యాసిడ్ లను తొలగిస్తాయి.పోషకాలను తేలికగా శోషించుకోవడంలో సహాయపడుతాయి. నీటిలో నానబెట్టడం వల్ల అవి తేలికగా జీర్ణం అవుతాయి. ఖర్జూరాలను తినడానికి ముందు 8 నుంచి 10 గంటలు లేదా రాత్రంతా నానబెట్టడం మంచిది.

click me!