ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ లో సందర్శనీయ ప్రదేశాలు ఇవే!

First Published | Jan 28, 2022, 12:56 PM IST

భారతదేశంలోని అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలలో ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలోని హరిద్వార్ (Haridwar) ఒకటి. హరిద్వార్ సందర్శనకు, ఈ ప్రాంతంలోని పరమ పవిత్రమైన గంగా నదిలో స్నానమాచరించడానికి దేశం నలుమూలల నుండి యాత్రికులు వస్తూంటారు. ఈ ప్రాంతంలో అనేక సందర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

హరిద్వార్ లో ప్రధాన ఆకర్షణీయ ప్రదేశాలుగా మానసా దేవి ఆలయం, భారత మాత ఆలయం, చండీ దేవి ఆలయం, హర్ కీ పౌరీ, ఆనందమాయి ఆశ్రమం, పవన్ థామ్ ఇలా మొదలగునవి ఉన్నాయి. ఈ ప్రదేశాలు ఒకొక్కటి ఒకొక్క విశిష్టతను (Uniqueness) కలిగి పర్యాటకులను ఆకట్టుకునేలా (Impressive) ఉంటాయి. వీటి సందర్శన పర్యాటకులకు ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రశాంతతను కలిగిస్తాయి.
 

వైష్ణో దేవి ఆలయం: హరిద్వార్ లో వైష్ణవి దేవి ఆలయం (Vaishnavi Devi Temple) జమ్మూ వైష్ణవి దేవి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం హరిద్వార్ కు ప్రధాన ఆకర్షణగా ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి వివిధ సొరంగాల (Tunnels) గుండా వెళ్లాల్సి ఉంటుంది. శ్రీరాముడికి గొప్ప భక్తురాలైన వైష్ణవ మాత గౌరవార్థం ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణ కథనం. ఈ ఆలయ సందర్శన పర్యాటకులకు ఆకట్టుకునేలా ఉంటుంది.
 

Latest Videos


చండీ దేవి ఆలయం: హరిద్వార్ లోని నీల్ పర్వత్ అనే చిన్న కొండమీద చండీ దేవతకు అంకితమిస్తూ చండీ దేవి ఆలయాన్ని (Chandi Devi Temple) నిర్మించారు. ఈ ఆలయం హర్ కీ పౌరీకి (Har Ki Pauri) అతి సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడానికి మెట్ల మార్గం ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. మెట్లు ఎక్కలేని వారు కేబుల్ కార్ సహాయంతో కొండపైకి చేరుకోవచ్చు.
 

భారత మాత ఆలయం: హరిద్వార్ లోని ప్రసిద్ధి చెందిన ఆలయాలలో భారత మాతకు అంకితమిస్తూ (Dedicated) భారత మాత ఆలయాన్ని (Bharat Mata Temple) గంగానది ఒడ్డున నిర్మించారు. 8 అంతస్తుల ఎత్తైన ఈ భవనము సందర్శనలో పురాణ గాథలను తెలియజేసే పాత్రలు, దేవుళ్ల గురించి తెలుసుకోవచ్చు. హరిద్వార్ కు వెళ్లినప్పుడు ఈ భారత మాత ఆలయాన్ని తప్పక సందర్శించండి.
 

పవన్ థామ్: హరిద్వార్ లోని పరమపవిత్రమైన ప్రధాన ఆకర్షణ ప్రదేశంగా పవన్ థామ్ (Pawan Thom) ఉంది. ఇది నగరం నుండి రెండు కిలోమీటర్ల దూరంలో రిషికేష్ (Rishikesh) కు వెళ్లే మార్గంలో ఉంది. ఇక్కడ గాజు ఆలయం పర్యాటకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక్కడి గొప్ప నిర్మాణాల సందర్శన పర్యాటకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
 

మానసా దేవి ఆలయం: హరిద్వార్ లోని అతి ప్రాచీనమైన దేవాలయంగా మానసాదేవి ఆలయం (Manasa Devi Temple) ప్రసిద్ధి చెందినది. మానసా దేవికి అంకితమిస్తూ హరిద్వార్ లోని కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని బిల్వ తీర్థం (Bilva Theertham) అని కూడా అంటారు. హరిద్వార్ లోని ఐదు తీర్థాలలో బిల్వ తీర్థం ఒకటి. కొండ పైన ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి నడవడానికి వీలు పడనివారు కేబుల్ కార్ సహాయంతో కొండపైకి చేరుకోవచ్చు.

click me!