Chewing Gum: చూయింగ్ గమ్ నమలడం చాలా మందికి అలవాటు. అయితే నమిలిన తర్వాత నిర్లక్ష్యంగా ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల దుస్తులకు అంటుకునే అవకాశం ఉంటుంది. అయితే దీనిని తొలగించే అవకాశం లేదా అంటే కచ్చితంగా ఉంది.
వెనిగర్ అనేక గృహ అవసరాలకు ఉపయోగపడుతుంది. చూయింగ్ గమ్ తొలగించడంలో కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఒక చిన్న పాత్రలో కొద్దిగా వెనిగర్ తీసుకుని స్వల్పంగా వేడి చేయాలి. తర్వాత గమ్ అంటుకున్న బట్ట భాగాన్ని ఆ వెనిగర్‌లో కొన్ని నిమిషాలు నానబెట్టాలి. అనంతరం పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దితే గమ్ క్రమంగా విడిపోతుంది. గట్టిగా రుద్దకుండా జాగ్రత్తగా చేయడం మంచిది.
25
వేడి నీటితో కూడా మంచి ఫలితం
బట్టలకు అంటుకున్న చూయింగ్ గమ్‌ను వదిలించడానికి వేడి నీరు కూడా ఉపయోగపడుతుంది. గమ్ ఉన్న భాగాన్ని గోరువెచ్చని లేదా వేడి నీటిలో 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత బ్రష్ లేదా చేతితో నెమ్మదిగా రుద్దాలి. వేడి కారణంగా గమ్ మెత్తబడుతుంది. దీంతో దాన్ని సులభంగా తొలగించే అవకాశం ఉంటుంది.
35
ఐరన్ బాక్స్‌తో గమ్‌ను వేరు చేసే పద్ధతి
దుస్తులపై గట్టిగా అతుక్కున్న గమ్‌ను తొలగించేందుకు ఐరన్ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఐరన్ బోర్డుపై ఒక కార్డ్‌బోర్డ్ ముక్క ఉంచాలి. దాని మీద గమ్ అంటుకున్న భాగం కిందకు వచ్చేలా వస్త్రాన్ని పరచాలి. పైభాగంలో ఒక సన్నని వస్త్రం లేదా రుమాలు ఉంచి ఐరన్ చేయాలి. వేడి కారణంగా గమ్ కరిగి కార్డ్‌బోర్డ్‌కు అతుక్కుంటుంది. దీంతో దుస్తులపై ఉన్న గమ్ తగ్గిపోతుంది. ఈ పద్ధతి బట్టలకు ఎక్కువ నష్టం కలిగించకుండా పనిచేస్తుంది.
చూయింగ్ గమ్‌ను కఠినంగా మార్చి తొలగించాలంటే చల్లదనం ఉపయోగపడుతుంది. గమ్ ఉన్న ప్రదేశంలో కొన్ని నిమిషాల పాటు ఐస్ క్యూబ్స్ ఉంచాలి. చల్లబడిన తర్వాత గమ్ గట్టిపడి సులభంగా ఊడిపోతుంది. అలాగే హెయిర్ స్ప్రే కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. గమ్‌పై కొద్దిగా స్ప్రే చేస్తే అది గట్టిపడుతుంది. తర్వాత చేత్తో లేదా చిన్న స్పూన్ సహాయంతో తొలగించవచ్చు. అవసరమైతే ఈ ప్రక్రియను మరోసారి పునరావృతం చేయవచ్చు.
55
రబ్బింగ్ ఆల్కహాల్‌తో త్వరగా శుభ్రం చేయండి
చూయింగ్ గమ్ తొలగించడానికి రబ్బింగ్ ఆల్కహాల్ కూడా మంచి ఎంపికగా భావిస్తారు. ఒక స్పాంజ్ లేదా కాటన్‌పై కొద్దిగా రబ్బింగ్ ఆల్కహాల్ తీసుకుని గమ్ ఉన్న ప్రాంతంలో మెల్లగా రాయాలి. రెండు మూడు నిమిషాల తర్వాత చెక్క స్పూన్ లేదా ప్లాస్టిక్ స్క్రాపర్‌తో గమ్‌ను తీసేయాలి. ఈ పద్ధతి వల్ల సాధారణంగా దుస్తుల రంగు లేదా వస్త్ర నాణ్యతకు హాని కలగదు. అయినప్పటికీ ముందుగా బట్టలో కనిపించని చిన్న భాగంపై పరీక్షించడం మంచిది.