Hair Growth: కొబ్బరి నూనెలో ఇవి కలిపి రాస్తే.. రెండింతలు జుట్టు వేగంగా పెరుగుతుంది

Published : Jun 19, 2026, 05:55 PM IST

Hair Growth:  జుట్టు ఒత్తుగా పెరగడానికి ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా? అయితే ఉపయోగం లేదా?  అయితే.. వాటితో అవసరం లేకుండా..  కేవలం కొబ్బరి నూనె వాడితే చాలు.  ఆ నూనెలో కొన్నింటిని కలిపి రాస్తే.. జుట్టే వేగంగా పెరుగుతుంది..

PREV
15
కొబ్బరి నూనె తో జుట్టు పెరుగుదల..

ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు.  సరైన ఆహారం తీసుకోకపోవడం, మంచి నిద్ర, కాలుష్యం ఈ కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలిపోవచ్చు. జుట్టు రాలడం మొదలవ్వగానే చాలా మంది  ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతూ ఉంటారు. కానీ,  కొబ్బరి నూనెలో కొన్ని సహజ పదార్థాలు కలిపి జుట్టుకు అప్లై చేసినా కూడా  జుట్టు రాలడం తగ్గడమే కాదు.. రెట్టింపు వేగంగా కూడా పెరుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం….

25
కొబ్బరి నూనెతో జుట్టుకు ప్రయోజనాలు...

కొబ్బరి నూనె జుట్టుకు లోతైన పోషణ అందిస్తుంది.  కుదుళ్లను బలంగా చేస్తుంది.  అంతేకాదు.. కొబ్బరి నూనెలో  యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి తలలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి.  అందుకే.. రెగ్యులర్ గా జుట్టుకు కొబ్బరి నూనె రాస్తూ ఉండాలి. 

35
కొబ్బరి నూనెలో కలపాల్సినవి ఇవే..

కొబ్బరి నూనెలో కలబంద జెల్..

కలబంద జెల్ తలలో దురద, మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఈ కలబంద గుజ్జును కొబ్బరి నూనెలో కలిపి జుట్టుకు పట్టించడం వల్ల మీ హెయిర్ చాలా అందంగా మారుతుంది. చాలా స్మూత్ గా మారుతుంది. జుట్టు రాలడం సమస్యను కూడా తగ్గిస్తుంది.  హెయిర్ డ్యామేజ్ తగ్గిస్తుంది.



ఎలా రాయాలి?
2 చెంచాల కొబ్బరి నూనెలో 2 చెంచాల అలోవెరా జెల్ కలపండి. దీన్ని బాగా మిక్స్ చేసి తలకు పట్టించండి. 45 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.

45
కొబ్బరి నూనె, ఆముదం (Castor Oil)

ఆముదంలో రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది. దీన్ని కొబ్బరి నూనెతో కలిపితే, ఆముదం తల చర్మంలోకి సరిగ్గా ఇంకడానికి సహాయపడుతుంది.

ఎలా రాయాలి?
2 చెంచాల కొబ్బరి నూనెలో అంతే మోతాదులో ఆముదం కలపండి. ఇప్పుడు దీంతో తలకు బాగా మసాజ్ చేయండి. ఆ తర్వాత 2 గంటల పాటు అలానే వదిలేసి, షాంపూతో కడగండి.

55
కొబ్బరి నూనె, ఉల్లి రసం


జుట్టు పెరగడానికి ఉల్లి రసం ఒక ప్రభావవంతమైన దేశీ చిట్కా. ఎందుకంటే దీనిలో ఉండే సల్ఫర్, కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా, ఉల్లిపాయ యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు తలను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

ఎలా రాయాలి?
2 చెంచాల కొబ్బరి నూనెలో సమాన పరిమాణంలో ఉల్లి రసం కలపండి. దీన్ని తలకు పట్టించి 1 గంట పాటు అలానే ఉంచండి. ఆ తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి కడగండి. ఈ చిట్కాను వారానికి 2 సార్లు ఉపయోగించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories