Chanakya Niti: ముసలోళ్లు అయ్యేలోగా కచ్చితంగా నేర్చుకోవాల్సింది ఇదే..!

Published : Mar 27, 2026, 05:22 PM IST

Chanakya Niti: ఆచార్య చాణక్యుడి ప్రకారం, జీవితంలో విజయం సాధించాలంటే కేవలం కష్టపడితే సరిపోదు,సరైన సమయంలో జీవిత పాఠాలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ముసలి వాళ్లు అయ్యేలోగా కొన్ని విషయాలు నేర్చుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు. 

PREV
13
Chanakya Niti

జీవితంలో విజయం సాధించాలని చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే.. అలా సక్సెస్ అవ్వాలంటే.. ముసలివాళ్లం అయ్యేలోగా కొన్ని జీవిత పాఠాలు కచ్చితంగా నేర్చుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు. ముసలి వాళ్లు అయిన తర్వాత ఎంత జ్ఞానం సంపాదించినా ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకే.. ఆలోగా కచ్చితంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం...

23
ముసలోళ్లు కాకముందే తెలుసుకోవాల్సిన విషయాలు..

1.సమయం విలువ..

చాణక్యుడి ప్రకారం, గడిచిన కాలం మళ్లీ తిరిగి రాదు. చాలా మంది వయసులో ఉన్నప్పుడు సమయాన్ని వృథా చేసి, ముసలితనంలో పశ్చాత్తాపపడుతూ ఉంటారు. ఏ వయసులో చేయాల్సిన పనిని ఆ మయసులోనే పూర్తి చేసేవాడే అసలైన మేథావి.

2.ఆర్థిక క్రమశిక్షణ..

డబ్బును ఎలా సంపాదించాలి? ఎలా పొదుపు చేయాలో కూడా చిన్న వయసులోనే నేర్చుకోవాలి. సంపద ఉన్నప్పుడు ఖర్చు చేసేవాడు లేనప్పుడు కష్టపడతాడు. వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలంటే యువకులుగా ఉన్నప్పుడే ఆర్థికంగా స్థిరపడటం చాలా ముఖ్యం.

3.ఆరోగ్యమే మహా భాగ్యం..

వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు, ముసలితనంలో సంపాదించినంతా ఆసుపత్రులకే ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే.. క్రమశిక్షతో కూడిన ఆహారం, వ్యాయామం అనేవి శరీరం సహకరించినప్పుడే అలవాటు చేసుకోవాలి.

33
4. ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం :

అన్ని తప్పులు మనమే చేసి నేర్చుకోవడానికి జీవితం చాలా చిన్నది. తెలివైన వాడు ఇతరుల వైఫల్యాలను చూసి పాఠాలు నేర్చుకుంటాడు. ఇది మిమ్మల్ని త్వరగా విజయ తీరాలకు చేరుస్తుంది.

5. ధర్మం , నైతికత :

జీవితాంతం కేవలం సుఖాల వెంటే పరుగెత్తకూడదు. ధర్మబద్ధమైన జీవితం, ఇతరులకు సహాయపడటం వంటివి నేర్చుకోవాలి. ఇది వృద్ధాప్యంలో మనశ్శాంతిని, సమాజంలో గౌరవాన్ని ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories