Coriander Benefits: రోజూ కొత్తిమీర తింటే ఏమవుతుంది?

Published : Mar 27, 2026, 04:21 PM IST

Coriander Benefits: వంట ఏదైనా సరే.. చివర్లో కొత్తిమీర చల్లితే ఆ రుచే వేరు. దీనిలో మనకు తెలియని మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆ అద్భుత ప్రయోజనాలెంటో ఇప్పుడు చూద్దాం. 

PREV
15
కొత్తిమీర వాసనకే కడుపు నిండిపోద్ది

చాలా మందికి కొత్తిమీర లేనిదే వంట ఫినిష్ అవ్వదు. వేడి వేడి చారులోనైనా, సాంబార్‍లోనైనా, పులిహోర, టమాట,కొత్తిమీర పచ్చడి...ఇలా ప్రతీదాంట్లో కొత్తిమీర ఉండాల్సిందే. ఎందుకంటే దాని నుంచే వచ్చే సువాసనకే కడుపునిండిపోద్ది. అయితే కొత్తిమీర కేవలం రుచికోసమే కాదు శరీరానికి కావలసినంతా పోషకాలు ఇస్తుంది. ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. కానీ కొందరికి ఆ వాసనంటే పడదు, అది తినాలన్న నచ్చదు. అలాంటి వాళ్ల కొత్తిమీర వల్ల కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పండి...వెంటనే తినడం ప్రారంభిస్తారు.  

25
కిడ్నీలను శుద్ధిచేస్తుంది

కొత్తిమీర శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. కిడ్నీలను క్లీన్ చేయడానికి కొత్తిమీర రసం లేదా కషాయం తాగడం చాలా మంచిది. ఉదయాన్నే కొత్తిమీరను నీటిలో మరిగించి ఆ నీటిని తాగితే మరిన్ని ఫలితాలు ఉంటాయి. 

35
జీర్ణక్రియ మెరుగుపడుతుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

కొత్తిమీరలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు కొత్తిమీరను తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఆకలిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

షుగర్ తగ్గించొచ్చు

షుగర్ పేషెంట్లకు కొత్తిమీర మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు లేదా ధనియాలు రక్తంలో ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. 

45
రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఇందులో 'విటమిన్ సి' ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.

55
చర్మ సౌందర్యం

గుండె ఆరోగ్యానికి మేలు

కొత్తిమీర శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చర్మ సౌందర్యం

చర్మ సౌందర్యంలోనూ పనిచేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం వల్ల కొత్తిమీర చర్మ సమస్యలను తగ్గిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం నిగారించేలా చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories