Power Saving Tips: AC, కూలర్, ఫ్యాన్ ఎక్కువగా వాడినా కరెంట్ బిల్లు తగ్గాలా? ఇలా చేస్తే చాలు!

Published : Mar 27, 2026, 03:48 PM IST

రోజురోజుకీ ఎండలు పెరుగుతున్నాయి. వేడి వల్ల ప్రతి ఇంట్లో AC, కూలర్, ఫ్యాన్ వాడకం పెరిగిపోయింది. అయితే వీటిని ఎక్కువగా వాడితే కరెంట్ బిల్లు మోత మోగుతుంది. కానీ ఈ సింపుల్ చిట్కాలతో బిల్లు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. 

PREV
15
వేసవిలో కరెంట్ బిల్లు తగ్గించే చిట్కాలు

వేసవి కాలంలో ఎక్కువ మంది ఇళ్లలో AC, కూలర్, ఫ్యాన్ లాంటి ఉపకరణాలు నిరంతరం ఉపయోగిస్తుంటారు. దానివల్ల ఇంట్లో సౌకర్యం పెరిగినా, నెలాఖరులో వచ్చే విద్యుత్ బిల్లు మాత్రం చాలా మందిని షాక్‌కు గురిచేస్తుంది. అయితే కొన్ని స్మార్ట్ అలవాట్లు, సరైన పద్ధతులు పాటిస్తే AC, కూలర్, ఫ్యాన్ ఎక్కువగా ఉపయోగించినా కూడా విద్యుత్ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.

25
AC ఎలా ఉపయోగించాలంటే?

AC వినియోగంలో చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను ఇస్తాయి. చాలామంది గది త్వరగా చల్లబడాలని 18°C లేదా 20°C వద్ద AC పెట్టుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం 24°C నుంచి 26°C మధ్య పెట్టుకోవడం మంచిది. ఇది విద్యుత్ వినియోగాన్ని చాలా తగ్గిస్తుంది. అలాగే ACతో పాటు ఫ్యాన్ ఉపయోగిస్తే గది త్వరగా చల్లబడుతుంది. దీంతో ACపై లోడ్ తగ్గి బిల్లు కూడా తగ్గుతుంది. రాత్రి నిద్రపోయే సమయంలో టైమర్ ఉపయోగించడం కూడా మంచి అలవాటు.

35
కూలర్ వాడేటప్పుడు..

కూలర్ వినియోగంలో కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. కూలర్‌ను గాలి సరిగ్గా వచ్చే ప్లేస్‍లో పెట్టాలి. ముఖ్యంగా కిటికీ దగ్గర ఉంచితే కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది కూలర్‌ను క్లోజ్డ్ రూములో ఉపయోగిస్తుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. సరైన గాలి ప్రసరణ లేకపోతే కూలింగ్ తగ్గిపోతుంది. పైగా విద్యుత్ కూడా వృథా అవుతుంది. కూలర్‌లోని ప్యాడ్లు శుభ్రంగా ఉంచడం, నీటిని తరచుగా మార్చడం ద్వారా కూడా పనితీరు మెరుగవుతుంది.

45
ఫ్యాన్ ని శుభ్రం చేయడం

ఫ్యాన్ విషయానికి వస్తే, ఇది తక్కువ విద్యుత్ వినియోగించినా, ఫ్యాన్ బ్లేడ్లపై దుమ్ము పేరుకుపోతే గాలి ప్రవాహం తగ్గిపోతుంది. దీంతో ఎక్కువ స్పీడ్ గా తిరిగినా చల్లగా అనిపించదు. కాబట్టి వారానికి ఒకసారి ఫ్యాన్‍ని శుభ్రం చేయడం మంచిది. అలాగే గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ ఆఫ్ చేయడం చిన్న విషయమే అయినా బిల్లుపై పెద్ద ప్రభావం చూపుతుంది.

55
ఇంటి వాతావరణం

అలాగే ఇంటి లోపలి వాతావరణాన్ని చల్లగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే. కిటికీలకు ముదురు రంగు కర్టెన్లు వేయడం, సూర్యరశ్మి నేరుగా గదిలోకి రాకుండా చూసుకోవడం ద్వారా గది ఉష్ణోగ్రతను తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే AC లేదా కూలర్‌పై ఆధారపడే అవసరం కొంత తగ్గుతుంది. అలాగే ఉదయం, సాయంత్రం సహజ గాలి ఉపయోగించుకోవడం ద్వారా కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories