మతిమరుపు ఎందుకు వస్తుందో తెలుసా?

First Published Sep 17, 2022, 12:00 PM IST

నిమిషం కింద చెప్పిన విషయాలను కూడా మర్చిపోతుంటారు కొందరు. కానీ కొద్దిసేపటికీ మళ్లీ గుర్తొస్తాయి. ఈ మతిమరుపు సమస్య మనల్ని ఎన్నో ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇంతకీ మతిమరుపు ఎందుకొస్తుందో తెలుసా..? 
 

సాధారణంగా మతిమరుపు వయసు మీద పడుతున్నవాళ్లలోనే ఎక్కువగా వస్తుంది. దీని వల్ల ఇప్పుడే చెప్పిన విషయాలను కూడా మర్చిపోతుంటారు. అయితే ఈ సమస్య యువతలో కూడా కనిపిస్తుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది.. కారణాలేంటో తెలుసుకుందాం పదండి. 

నిద్రలేమి

నిద్రలేమి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఇది మెమోరీ పవర్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు.. కంటి నిండా నిద్రపోని వారు విషయాలను ఊరికూరికే మర్చిపోతుంటారు. ఎందుకంటే నిద్రలోనే విషయాలను గుర్తుంచుకునే బ్రెయిన్ కణాలు బలంగా మారుతాయి. అందుకే విషయాలు గుర్తుండాలంటే రాత్రిపూట 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అలాగే పోషకాహారం తింటూ రోజూ వ్యాయమం చేయాలి. కాఫీలు, టీలు, ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిది.

డయాబెటీస్

డయాబెటీస్ పేషెంట్లు కూడా మతిమరుపు సమస్యతో బాధపడే అవకాశం ఉంది. వీరి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటే మాత్రం బ్రెయిన్ లోని సూక్ష్మ రక్తనాళాలు దెబ్బతిని మతిమరుపు సమస్య వస్తుంది. అందుకే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. 
 

జన్యువులు

తల్లిదండ్రుల నుంచి వచ్చే జన్యువుల వల్ల కూడా మతిమరుపు రావొచ్చు. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే మీకొచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
 

వయసు

వయసు మీద పడుతున్న కొద్దీ మతిమరుపు స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది అధిక రక్తపోటు, తీసుకునే ఆహారం, డయాబెటీస్, శారీరక శ్రమ, జన్యువులు, హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 
 

పక్షవాతం

పక్షపాతం బ్రెయిన్ సగ భాగానికి రక్తం అందకపోతే వస్తుంది. దీనివల్ల బ్రెయిన్ కణజాలం దెబ్బతిని విషయాలను గుర్తుంచుకునే సామర్థ్యం తగ్గుతుంది. అలాగే ఏకాగ్రత కూడా పోతుంది. ఆలోచించలేరు కూడా. డిమెన్షియాకు గుండె జబ్బులు, హై బీపీ, స్మోకింగ్ వంటివి కారణాలు. పక్షపాతం బారిన పడితే.. మాట తీరు సరిగ్గా ఉండదు. తత్తరపడతారు. ఒక కాలు, చేయి శక్తిలేకుండా ఉంటాయి. ఇలాంటి లక్షణాల కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 
 

smoking

స్మోకింగ్

స్మోకింగ్ వల్ల కూడా మతిమరుపు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ స్మోక్ చేసే వారు విషయాలను గుర్తుంచుకోలేరట. ఎందుకంటే దీనివల్ల బ్రెయిన్ రక్తణాళాలు దెబ్బతింటాయి.  దీనివల్ల ఒక్క మతిమరుపే కాదు.. పక్షపాతం బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానుకోవడం బెటర్. 

ఊబకాయం

ఊబకాయం అధిక రక్తపోటు, గుండె పోటు వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అంతేకాదు దీనివల్ల మతిమరుపు సమస్య కూడా రావొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఓవర్ వెయిట్ వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది. అందుకే బరువును నియంత్రణలో ఉంచుకోండి. 

exercise

వ్యాయామం చేయకపోవడం

రెగ్యులర్ గా ఎక్సర్ సైజెస్ చేస్తే శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. అంతకాదు డిమెన్షియా, మతిమరుపు  సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. కాబట్టి రోజూ కొంత సమయాన్ని వ్యాయామం చేయడానికి కేటాయించండి. ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటారు.  

click me!