బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే వీటిని ఇలా అస్సలు తినకండి..

First Published Sep 17, 2022, 10:50 AM IST

పండ్లు, కూరగాయల్లో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పీచు కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల అంత తొందరగా ఆకలి కాదన్న మాట. దీనివల్ల మీరు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. ఈ పీచు మలబద్దకం సమస్యను కూడా పోగొడుతుంది. 
 

కూరగాయలనే కాదు.. పండ్ల తొక్కలను కూడా తీసేసె వారు చాలా మందే ఉన్నారు. వీటిని నీట్ గా చెక్కు తీసేసే వంట చేస్తుంటారు. ఇలా చెక్కు తీస్తే పురుగులమందు తొలగిపోతుందనో లేకపోతే రుచి బాగుంటుందనో  ఇలా చేస్తుంటారు. నిజానికి కూరగాయలను, పండ్లను తొక్కతో సహా తినడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మీకు తెలుసా.. 31 శాతం పీచు ఒక్క పొట్టులోనే ఉంటుందట. ఈ పీచు మన కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మీకు అంత తొందరగా ఆకలి కాకుండా చేస్తుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. ఈ పీచు జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మలబద్దకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మరెన్నో అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అందుకే పండ్లైనా, కూరగాయలైనా పొట్టు తీయకుండానే తినండి. బరువు తగ్గాలంటే వేటిని పొట్టు తీయకుండా తినాలో తెలుసుకుందాం పదండి..

బంగాళాదుంప

బంగాళాదుంపతో రకరకాల రెసిపీలు చేసుకుని తింటుంటారు. వీటితో చేసిన ఏ కూరైనా టేస్టీగా ఉంటుంది. అయితే చాలా మంది వీటి పొట్టునే తీసే వండుతుంటారు. కానీ పొట్టుతో సహా వండుకుని తింటేనే మీరు దీని ప్రయోజనాలను పొందుతారు. ఎందుకంటే పొట్టులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే వీటిని అలాగే తినండి. 
 

పుచ్చకాయ

ఎండాకాలం వస్తే చాలు పుచ్చకాయలను రోజూ తింటుంటారు. దీనిలో ఎక్కువ మొత్తంలో ఉంటే వాటర్ కంటెంట్ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పుచ్చకాయను తొక్కతో సహా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇది రక్తం నుంచి నైట్రోజన్ ను తొలగిస్తుంది. మజిల్స్ నొప్పులను కూడా తగ్గిస్తుంది. అందుకే పుచ్చకాయను తొక్కతో సహా తినేయండి. ఇలా తినాలనిపించకపోతే పచ్చడి, జ్యూస్ గా చేసుకుని తాగండి. 

యాపిల్ 

యాపిల్ పండును తొక్కతో సహా తింటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు, ఖనిజాలు అందుతాయి. వీటిలో పీచు పదార్థం కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఊపిరితిత్తులను, బ్రెయిన్ ను ఆరోగ్యంగా ఉంచడాకి సహాయపడతాయి. 
 

కీరదోస

కీరదోస మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని పొట్టుతో సహా తింటే మీ శరీరానికి ఎక్కువ మొత్తంలో యాంటీ  ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ కె వంటివి లభిస్తాయి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కీరాను తొక్కతో సహా తింటే మీ రక్తం గడ్డకట్టే ప్రమాదం తప్పుతుంది. ఎముకలు పటిష్టంగా మారుతాయి. అందుకే వీటిలో తొక్కతోనే తినండి. 
 

Mangoes

మామిడి పండ్లు

మామిడి పండ్ల గుజ్జును మాత్రమే తిని.. తొక్కను డస్ట్ బిన్ లో వేసే వారు చాలా మందే ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే మామిడి పండ్లను ఏ ఒక్కరు కూడా తొక్కతో తినరు. కానీ మామిడి పండ్లను తొక్కతోనే తినాలి. ఎందుకంటే పండిన మామిడి తొక్కలో ఎక్కువ మొత్తంలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ సి, పాలీఫెనాల్స్, విటమిన్ ఇ వంటివి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి మామిడి పండ్లను తొక్కతోనే తినండి. 
 

నారింజ

సిట్రస్ పండు నారింజలో విటమిన్ సి కి కొదవే ఉండదు. అయితే ఈ పండులో కంటే దీని తొక్కలోనే డబుల్ విటమిన్ సి ఉంటుందట. అంతేకాదు ఈ తొక్కలో మెగ్నీషియం, విటమిన్ బి6, రైబోఫ్లావిన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ తొక్కలను తినడం కాస్త కష్టమే. ఎందుకంటే ఇది కాస్త చేదుగా ఉంటుంది. సో దీన్ని చాక్లెట్లతో తినండి. సలాడ్ చేసుకుని కూడా తినొచ్చు. 
 

click me!