మోదీ 72వ పుట్టినరోజు: ప్రధాని హెల్త్ సీక్రెట్ ఇదే..!

First Published Sep 17, 2022, 11:11 AM IST

ఎంత ఒత్తిడి ఉన్నా.. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆయన ఈ రోజు 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం వెనక సీక్రెట్ ఏంటో, ఆయన ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ ఏంటో ఓసారి చూద్దాం..
 

ఈ రోజుల్లో పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నవారు చాలా మందే ఉన్నారు. మనం చిన్నపాటి ఉద్యోగానికే ఇంత ఒత్తిడికి గురై.. అనారోగ్యానికి గురౌతుంటే... దేశ ప్రధాని హోదాలో ఉన్నవారికి మరెంత ఒత్తిడి ఉంటుందో ఓసారి ఊహించండి. అయితే.... ఎంత ఒత్తిడి ఉన్నా.. ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఆయన ఈ రోజు 72వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం వెనక సీక్రెట్ ఏంటో, ఆయన ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ ఏంటో ఓసారి చూద్దాం..
 

pm modi

ప్రధాని నరేంద్రమోదీ... తన ఆరోగ్యం కాపాడుకోవడానికి,  ఒత్తిడి నుంచి బయటపడటానికి ఆయన ప్రతిరోజూ యోగా చేస్తూ ఉంటారట. ప్రతిరోజూ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ... ఆయన యోగాని మాత్రం పక్కన పెట్టరట. తాను యోగా చేస్తున్న విషయాన్ని ఆయన 2020లో ట్విట్టర్ వేదికగా తెలియజేశారు

మార్చి 2020లో ఒక ట్వీట్‌లో - కోవిడ్ మహమ్మారి  విపరీతత ప్రపంచాన్ని తాకుతున్న సమయంలో - "యోగ సాధన చాలా సంవత్సరాలుగా నా జీవితంలో అంతర్భాగంగా ఉంది. అది ప్రయోజనకరంగా ఉందని నేను కనుగొన్నాను" అని ప్రధాని ట్వీట్ చేశారు. తనకు సమయం దొరికినప్పుడల్లా  తాను వారానికి రెండు సార్లు యోగ నిద్రలో పాల్గొంటానని ఆయన చాలా సార్లు చెప్పడం గమనార్హం.
 

యోగా చేయడం మాత్రమే కాకుండా... మోదీ ఆయుర్వేదాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు. సాధారణ జబ్బుల నుంచి బయటపడటానికి ఆయన సాధారణ మందులు కాకుండా... ఆయుర్వేదంపై దృష్టిపెడతారు. ఎప్పుడైనా జలబు చేస్తే ఆయన ఆయన వేడి నీరు మాత్రమే తాగుతారట. దాని నుంచే తనకు ఉపశమనం కలుగుతుందని ఆయన చెప్పడం గమనార్హం.

ఉదయం వ్యాయామం
తాను ఆరోగ్యంగా ఉండటానికి శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు ఎక్కువగా చేస్తానని మోదీ చెప్పడం గమనార్హం. ఆయన ప్రతిరోజూ శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను చేస్తూ ఉంటారు. 2018లో ఆయన దీని గురించి ఓ ట్వీట్ చేశారు. తాను శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను చేస్తానని ఆయన చెప్పడం గమనార్హం.
 

pm modi birthday

ఆరోగ్యకరమైన అల్పాహారం
ప్రధాని మోదీ తన రోజును ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభిస్తారు, ఇందులో ఎక్కువగా పోహా, అల్లం టీ ఉంటాయి. ప్రధానమంత్రి మోదీ శాకాహారం ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఆయన ఆహారంలో పండ్లు, కూరగాయలు తీసుకుంటారు. అతను సాంప్రదాయ దక్షిణ భారతీయ, గుజరాతీ వంటకాలను ఎక్కువగా తీసుకుంటారు.

click me!