తరచుగా కళ్లు తిరుగుతున్నాయా? ఈ వ్యాధి వల్లే కావొచ్చు.. చెక్ చేసుకోండి..

Published : Oct 19, 2022, 11:52 AM IST

కొంతమందికి తరచుగా కళ్లు తిరుగుతుంటాయి. ఇలా కళ్లు తిరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని వ్యాధుల వల్ల కూడా కళ్లు తిరుగుతాయని నిపుణులు చెబుతున్నాయి.   

PREV
17
తరచుగా కళ్లు తిరుగుతున్నాయా? ఈ వ్యాధి వల్లే కావొచ్చు.. చెక్ చేసుకోండి..

కళ్లు తిరగడానికి కారణాలేన్నో ఉంటాయి. బీపీ తక్కువ కావడం, ఒత్తిడి ఎక్కువ అవడం వంటి ఎన్నో కారణాల వల్ల కళ్లు తిరుగుతాయి. అయితే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా కళ్లు తిరుగుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం పదండి.. 

27

విర్టిగో

ఈ సమస్య వల్ల ఉన్నట్టుండి.. శరీరం మొత్తం కదిలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు చుట్టుపక్కల మొత్తం తిరుగుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. దీనికి చెవి సమస్యే కారణం. అంటే చెవి లోపలికి కాల్షియం కార్బోనేట్ పార్టికల్స్ వెళతాయి. వీటివల్లే కళ్లు తిరుగుతాయి. 

37

మైగ్రేన్

మైగ్రేన్ నొప్పి మాటల్లో చెప్పలేనిది. ఈ నొప్పి ఒక్కో సారి వారం రోజుల పాటు కూడా ఉంటుంది. అయితే మైగ్రేన్ వల్ల ఒక్క తలనొప్పి మాత్రమే కాదు.. వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి. వీటితో పాటుగా కళ్లు కూడా తిరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే కళ్లు తిరగడం మైగ్రేన్ కు సంకేతం వంటిది. 
 

 

47

లో బీపీ

కొందరిలో బీపీ ఎక్కువగా ఉంటే.. ఇంకొంత మందిలో బీపీ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా ఒక్కోసారి కళ్లు తిరుగుతాయి. బీపీ తక్కువైతే.. ఉన్నట్టుండి కూర్చోవడం, కింద పడిపోవడం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.

అయితే గర్భం దాల్చితే కూడా కళ్లు తిరుగుతాయి. అలాగే బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు, గాయం వల్ల రక్తం కారితే కూడా కూడా కళ్లు తిరుగుతుంటాయి. 

57

రక్తహీనత

శరీరంలో రక్తం తగ్గితే కూడా కళ్లు తిరుగుతాయి. అంటే రక్తహీనత వల్ల మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో కళ్లు తిరుగుతాయి. దీనివల్ల నీరసంగా కూడా అనిపిస్తుంది. 
 

67

రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం (హైపోగ్లైసిమియా)

రక్తంలో ఎప్పుడూ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే దాన్ని.. మధుమేహం అంటారు. అయితే కొంతమందిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అయితే ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గితే కూడా కళ్లు తిరుగుతాయి. కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా కళ్లు తిరుగుతాయి. హార్మోన్లు అసమతుల్యంగా ఉంటే కూడా ఒక్కో సారి ఇలా అవుతుంది. 
 

77

ఒత్తిడి

ఒత్తిడి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందులో ఒకటి కళ్లు తిరగడం. భరించలేని ఒత్తిడికి గురైనప్పుడు కళ్లు తిరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండెకు సంబంధించిన సమస్యలు, డిప్రెషన్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, యాంగ్జైటి వంటి సమస్య వల్ల కూడా కళ్లు తిరుగుతాయి.                 
 

Read more Photos on
click me!

Recommended Stories