ఈ ఆహారాలు, వంటచేసే పద్దతులే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ ను సీక్రేట్ గా పెంచుతాయి.. జర జాగ్రత్త..

Published : Oct 19, 2022, 10:43 AM IST

సహజంగా కొలెస్ట్రాల్ మంచిది. ఇది ఎన్నో విధులను నిర్వహిస్తుంది.  కణాలు, సాధారణ హార్మోన్లను తయారుచేయడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరపడుతుంది. కానీ ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువైతే మాత్రం మంచి కాస్త చెడుగా మారుతుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. 

PREV
17
 ఈ ఆహారాలు, వంటచేసే పద్దతులే మీ ఒంట్లో కొలెస్ట్రాల్ ను  సీక్రేట్ గా పెంచుతాయి.. జర జాగ్రత్త..
high cholesterol

మన శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. అయినా ఇది మన శరీరంలో సహజంగా సంభవించే పదార్థం కూడా. ఇది ఎన్నో విధులను నిర్వహిస్తుంది. కణాలను, హార్మోన్లను తయారుచేయడానికి ఈ కొలెస్ట్రాల్ చాలా అవసరం. అయితే కొలెస్ట్రాల్ మోతాదులో ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. మోతాదుకు మించితేనే లేని పోని రోగాలొచ్చే అవకాశం  ఉంది.  దీన్ని నియంత్రించకపోతే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. 

27
High Cholesterol

శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఒకటి మీరు తినే ఆహారం. ఇది జస్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాల వల్లే కాదు.. ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త  కొవ్వులు ఎక్కువగా ఉండే ఇతర ఆహారాల వల్ల కూడా పెరుగుతుంది. మీ శరీరంలో సీక్రేట్ గా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే కొన్ని ఆహారాలు, వంట చేసే పద్దతుల గురించి తెలుసుకుందాం.. 

37

వేయించిన ఆహారాలు

వేయించిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. కేలరీల వినియోగం ఎక్కవగా అవుతుంది. అలాగే మీ శరీరంలో రోజు రోజుకు కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరుగుతాయి. వివిధ పద్దతుల్లో వండిన ఆహారాలతో పోల్చితే వేయించిన ఆహారాల్లోనే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. డోనట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని వేయిస్తారు. వీటిలో  ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీగుండెకు మంచివి కావు. వేయించిన ఆహారాలకు బదులుగా గ్రిల్లింగ్ చేసిన ఆహారాలను తినడం. 
 

47

కాల్చిన ఆహారాలు

కాల్చిన ఆహారాలు (Baked goods) చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఇవి హెల్తీవి కావు. ఎందుకంటే ఇవి మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా పెంచుతాయి. కాల్చిన చిప్స్ లేదా ఇతర ప్రాసెస్ చేసిన స్నాక్స్ లో కొవ్వు పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందులోనూ వీటిని శుద్ధి చేసిన కార్భోహైడ్రేట్లతో తయారుచేస్తారు. ఇవి మీ రక్తంలో ట్రైగ్లిజరైడ్లను పెంచుతాయి. అలాగే శరీరంలో మంటను కలిగిస్తాయి. వీటిని తయారుచేయడానికి ఉపయోగించే నూనెను కూడా మీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. 

 

57

ప్రాసెస్ చేసిన రెడ్ మీట్

సాసేజ్, బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సోడియం,  సంతృప్త కొవ్వు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. న్యూట్రిషన్, మెటబాలిజం & వార్డియోవాస్కులర్ డిసీజెస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. రెగ్యులర్ గా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తింటే  శరీరంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరుగుతాయి. వీటికి బదులుగా ఫ్రెష్ మాంసాన్నే తినడం. అలాగే ఇంట్లో తక్కువ నూనెతో తినడం అలవాటు చేసుకోండి. 
 

67
alcohol

మితిమీరిన ఆల్కహాల్

రెగ్యలర్ గా ఆల్కహాల్ ను తాగడం వల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల గుండె ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ఆల్కహాల్ కు దూరంగా ఉండండి. ఒకవేళ తాగాల్సి వస్తే తక్కువగా తాగండి. 
 

77

ఫైనల్ గా..

అయితే మీరు ఈ ఆహారాలను మొత్తానికే మానుకోవాల్సిన అవసరం లేదు. ఎపుడైనా ఒకసారి తినొచ్చు. కానీ ప్రతిరోజూ వేయించిన ఆహారాలను తినడం, మద్యం తాగడం వంటి అలవాట్లను మానుకోవాలి. అప్పుడే మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ప్రమాదకరమైన రోగాల ప్రమాదం కూడా తప్పుతుంది. 

కొలెస్ట్రాల్ తగ్గాలంటే చెడు ఆహారాలను తినడం తగ్గించడమే కాదు.. మీ లైఫ్ స్టైల్ బాగుండాలి. అంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. బాగా నిద్రపోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. 

Read more Photos on
click me!

Recommended Stories