ఊబకాయం నుంచి బయటపడటానికి ఎన్నో ప్రయత్నాలను చేసిన వారు.. చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో ఇవి తింటే బరువు పెరిగిపోతాం.. అవి తింటే బరువు పెరిగిపోతాం...బరువు తగ్గాలంటే రోజుకు ఒకసారే తినాలి అన్న నియమాలను పెట్టుకునే వారు కూడా లేకపోలేదు. మీరు కడుపును మాడ్చినంత మాత్రాన బరువు తగ్గిపోతారనేది కేవలం మీ అపోహే. బరువు తగ్గాలంటే పోషకాహారాన్ని పుష్కలంగా తినాలి. అయితే మీరు ఏమి తింటున్నారనేది మాత్రమే కాదు.. దానిని ఎప్పుడు తింటున్నారనేది కూడా ముఖ్యమే. రాత్రిపూట ఎప్పుడో తొమ్మిది, పది, పదకొండు గంటలకు తినే అలవాటుందా? అయితే ఈ అలవాటును ఈ రోజు నుంచే విడిచిపెట్టండి. ఎందుకంటే రాత్రిపూట లేట్ గా తింటే బరువు పెరిగిపోతారని నిపుణులు చెబుతున్నారు. తిన్న ఆహారం జీర్ణం కావడానికి తగిన సమయం ఉండాలి. కాబట్టి మీరు పడుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు గంటల ముందే భోజనం చేయండి. దీనివల్ల ఫుడ్ సులువుగా అరుగుతుంది. కేలరీలు కూడా ఖర్చైపోతాయి.