Curd: ఎండాకాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టొచ్చా? పెడితే ఎన్ని రోజుల్లోపు వాడాలి?

Published : May 01, 2026, 03:57 PM IST

Curd: సమ్మర్ లో పెరుగు వంటి డెయిరీ ఉత్పత్తులను ఎక్కువగా వాడుతారు. ఇవి శరీరానికి చలువ చేస్తాయి. వేసవిలో పెరుగు త్వరగా పాడవుతుందని, చాలామంది అవసరానికి మించి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అసలు పెరుగును ఫ్రిజ్‌లో పెట్టొచ్చా? పెడితే ఎన్ని రోజుల్లోపు వాడాలి? 

PREV
15
ఎండాకాలంలో పెరుగు నిల్వ చేసే విధానం

పెరుగు శరీరానికి చలువ చేస్తుంది కాబట్టి ఎండాకాలంలో దీని వాడకం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే కొందరు పెరుగును పూర్తిగా గది ఉష్ణోగ్రతలో ఉంచితే, మరికొందరు అవసరానికి మించి ఫ్రిజ్ లో పెడుతుంటారు. అలా పెరుగును ఎక్కువ రోజులు ఫ్రిజ్ లో పెడితే ఏమవుతుంది? అసలు ఫ్రిజ్ లో పెట్టిన పెరుగును ఎన్ని రోజుల్లోపు వాడాలి వంటి విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

25
పెరుగును బయట పెడితే?

సాధారణంగా పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ మంచి బ్యాక్టీరియా సరైన ఉష్ణోగ్రతలో మాత్రమే సురక్షితంగా ఉంటుంది. వేసవిలో గది ఉష్ణోగ్రత 30°C కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పెరుగు బయట ఎక్కువసేపు ఉంచకూడదు. అధిక ఉష్ణోగ్రతలో బ్యాక్టీరియా అసమతుల్యంగా పెరిగి పెరుగు త్వరగా పాడవుతుంది. పాడైన పెరుగు తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఫుడ్ పాయిజనింగ్, డయేరియా వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

35
పెరుగును ఫ్రిజ్ లో పెడితే?

పెరుగు తయారైన తర్వాత అది గట్టిపడే దశలో 4–6 గంటలు గది ఉష్ణోగ్రతలో ఉంచడం మంచిది. కానీ ఆ తర్వాత దాన్ని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం ఉత్తమం. ఫ్రిజ్‌లో 4°C నుంచి 8°C మధ్య ఉష్ణోగ్రతలో పెరుగు ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఇది హానికర బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. అలాగే పెరుగులోని పోషక విలువలను నిలిపి ఉంచుతుంది.

45
ఎన్ని రోజుల్లోపు వాడాలి?

నిపుణుల ప్రకారం ఫ్రిజ్‌లో పెట్టిన పెరుగును 2–3 రోజుల్లో వాడేయడం మంచిది. అంతకంటే ఎక్కువ రోజులు ఉంచితే రుచి మాత్రమే కాకుండా పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. అలాగే పెరుగు తీసేటప్పుడు శుభ్రమైన స్పూన్ మాత్రమే ఉపయోగించాలి. చేతులు పెట్టడం లేదా తడి పాత్రలను వాడటం వంటివి చేస్తే పెరుగు త్వరగా పాడైపోతుంది.

55
ఇలా అస్సలు చేయకూడదు

పెరుగును నేరుగా సూర్యరశ్మి పడే చోట లేదా వంటగదిలో వేడి ప్రాంతంలో ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల పెరుగు చాలా త్వరగా పుల్లగా మారిపోతుంది. వేసవిలో ఉదయం లేదా మధ్యాహ్నం పెరుగు తీసుకోవడం మంచిది. మితంగా తీసుకుంటే ఏ సమయంలో తీసుకున్నా పెద్ద సమస్య ఉండదు.

Read more Photos on
click me!

Recommended Stories