Freezer: మీ ఫ్రిజ్ లో ఫ్రీజర్ గడ్డ కట్టిందా? ఎలా తొలగించాలో తెలుసా?

Published : May 01, 2026, 03:12 PM IST

Freezer: చాలా మంది ఇళ్లల్లో డీప్ ఫ్రీజ్ ఎక్కువగా గడ్డ కడుతూ ఉంటుంది. ఆ ఐస్ గడ్డ తొలగించడం అంత ఈజీ కాదు. కానీ, ఈ సింపుల్ చిట్కాలతో ఫ్రీజర్ ని క్లీన్ చేయచ్చు.

PREV
13
Freezer

ఈ రోజుల్లో ఫ్రిజ్ లేని ఇళ్లు లేదనే చెప్పాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఒక నిత్య అవసరమైన వస్తువుగా మారిపోయింది. అయితే... చాలా మందికి ఫ్రిజ్ ని ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు. దీని వల్ల ఫ్రిజ్ తొందరగా పాడైపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా డీప్ ఫ్రిజ్ పూర్తిగా గడ్డకట్టేస్తుంది. అలానే వదిలేస్తే.. చివరకు ఫ్రిజ్ పనితీరు తగ్గిపోతుంది. మరి.. డీప్ ఫ్రిజ్ గడ్డకట్టినప్పుడు ఏం చేయాలి? ఆ ఐస్ ఎలా తొలగించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

23
అసలు ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టడానికి కారణాలు ఏంటి..?

ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కట్టడం వెనక చాలా కారణాలు ఉన్నాయి. మనం చేసే పనుల కారణంగానే అలానే జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఫ్రిజ్ తలుపు లేదా గ్యాస్కెట్ పాడైతే ఫ్రీజర్ లో ఐస్ తొందరగా గడ్డ కడుతుంది. అది చెక్ చేసి గ్యాస్కట్ మారిస్తే.. ఫ్రిజ్ పాడవ్వకుండా ఉంటుంది.

అంతేకాకుండా.. ఫ్రిజ్ లో నీటిని ఆవిరి చేసే కాయిల్ పాడైతే కూడా ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కడుతుంది. ఈ కాయిల్ ఫ్రిజ్ లో నీరు ఎక్కువగా ఉంటే దాన్ని బయటకు పంపుతుంది. కాబట్టి, ఈ కాయిల్ ని తరచుగా శుభ్రం చేసినా కూడా ఐస్ గడ్డ కట్టదు. ఫ్రిజ్ లోని వాటర్ ఫిల్టర్ పాడైతే కూడా ఫ్రీజర్ లో ఐస్ గడ్డ కడుతుంది. కాబట్టి, దానిని వెంటనే మార్చేయాలి.

33
మరి, ఫ్రిజ్ లో ఐస్ ఎలా తొలగించాలి?

ముందుగా ఫ్రిజ్ ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత ఫ్రిజ్ నుంచి నీరు లీక్ కాకుండా ఉండే చోటికి మార్చాలి. ఇప్పుడు వేడి నీరు తీసుకొని.. ఒక కప్పు తో నీటిని ఫ్రీజర్ లో పోయాలి. ఐస్ మొత్తం తొందరగా కరిగిపోతుంది.

ఒక పాత్రలో వేడి నీరు పోసి ఫ్రిజర్ లో ఉంచి కొంతసేపు అలాగే వదిలేయాలి. ఫ్రీజర్ తలుపు మూసేయాలి. కొంత సేపటి తర్వాత ఐస్ కరిగిపోతుంది.

మీ ఇంట్లో హెయిర్ డ్రెయ్యర్ ఉంటే ఫ్రిజర్ లో ఉన్న ఐస్ ని సులభంగా కరిగించొచ్చు. ఫ్రీజర్ తలుపు తెరచి హెయిర్ డ్రెయ్యర్ ఆన్ చేస్తే.. అందులో నుంచి వచ్చే వేడి గాలికి ఐస్ ఈజీగా కరిగిపోతుంది. అంతేకానీ.. ఈ ఫ్రీజర్ లోని ఐస్ తొలగించడానికి స్టీల్ స్పూన్, ఐరన్ స్పూన్ వాడకూడదు. కావాలంటే చెక్క గరిటె వాడొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories