శుభ్రపరచడం: బియ్యం, పప్పులను రుబ్బే ముందు కనీసం 3 సార్లు బాగా కడగాలి. దీనివల్ల పిండి తెల్లగా వస్తుంది.
నానబెట్టే సమయం: అన్ని పదార్థాలను కనీసం 5 నుంచి 6 గంటల పాటు నీటిలో పూర్తిగా మునిగేలా నానబెట్టాలి. అటుకులను మాత్రం రుబ్బడానికి 10 నిమిషాల ముందు నానబెడితే సరిపోతుంది.
పిండి రుబ్బేటప్పుడు ఎక్కువ నీళ్లు వాడొద్దు. పిండి వెన్నలా నున్నగా ఉండాలి. నీళ్లు ఎక్కువైతే దోశలు సరిగ్గా రావు.
పులియబెట్టడం (Fermentation): రుబ్బిన పిండిని కనీసం 8 గంటలు లేదా రాత్రంతా పక్కన పెట్టాలి. పిండి బాగా పొంగితేనే దోశలు రుచిగా వస్తాయి.
ఉప్పు కలపడం: పిండి బాగా పులిసిన తర్వాత, దోశలు వేసే ముందు రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ముందే కలపకూడదు.