Guru Pournami : బడ్జెట్ ప్రెండ్లీ గురు పౌర్ణమి గిప్ట్ ఐడియాస్.. మీ టీచర్లను ఇవి ఫుల్ ఖుషీ చేయడం ఖాయం..!

Published : Jul 09, 2025, 07:20 PM IST

గురు పౌర్ణమికి మీ టీచర్లకు గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే బడ్జెట్ తక్కువలో అంటే కేవలం రూ.200 లోపు మంచి గిప్ట్ ఐడియాలేంటో తెలుసుకోండి. పెన్నుల నుంచి మొక్కల దాకా మీ టీచర్లకు ఖుషీ చేయండి!

PREV
18
గురు పౌర్ణమి గిప్ట్ ఐడియాస్

Guru Pournami : ''గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరా... గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమ:''... ఈ శ్లోకం చాలు విద్యార్థి జీవితంలో గురువు పాత్ర ఎంత గొప్పదో చెప్పడానికి. గురువును దైవ స్వరూపంగా భావించడం భారతీయ సంస్కృతిలో భాగం. ఇలా మనకు విద్యాబుద్దులు నేర్పే గురువులపై అభిమానాన్ని వ్యక్తం చేసేరోజు గురు పౌర్ణమి.

చాలా స్కూళ్లలో గురుపౌర్ణమికి ప్రత్యేక వేడుకలు జరుపుతారు... గురువులు, విద్యార్థులు కలిసి వేడుకల్లో పాల్గొంటారు. విద్యార్థులు తమ గురువులను పూజించడం, వారికి బహుమతులు ఇవ్వడం చేస్తారు. ఇలా ఈసారి గురు పౌర్ణమి జూన్ 10న అంటే రేపే ఉంది. కాబట్టి మీ గురువులకు మంచి గిప్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే తక్కువ ధరలో మీ టీచర్లు గుర్తుండిపోయే కొన్ని బహుమతులు ఇవ్వవచ్చు.

28
గురు పౌర్ణమి గిప్ట్స్

గురు పౌర్ణమి అనేది మీ గురువులకి గౌరవం చూపించడానికి ఉత్తమ సందర్భం. ప్రతి విద్యార్థి తమ గురువుకి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు... ఇలా తక్కువ బడ్జెట్లో కేవలం రూ.200 లోపు గిఫ్ట్ ఐడియాలు ఇక్కడ ఉన్నాయి.

1. మోటివేషనల్ కోట్స్ తో పెన్ను

ఉపాధ్యాయులు బాగా ఉపయోగించే వస్తువుల్లో పెన్ను ఒకటి. కాబట్టి రూ.150-200 లోపు మోటివేషనల్ కోట్స్ ఉన్న పెన్నులు దొరుకుతాయి. ఉదా: గురు బ్రహ్మ, గురు విష్ణు వంటి శ్లోకంతో కూడినవి. ఇలాంటి ప్రత్యేకమైన పెన్నులను మీ గురువులకు బహుమతిగా ఇవ్వవచ్చు. వాళ్లు ప్రతిసారి ఈ పెన్ను వాడినప్పుడు మీరు గుర్తుకొస్తారు.

38
2. చిన్న ఇండోర్ ప్లాంట్

మీ గురువుగారికి మొక్కలు ఇష్టమైతే చిన్న ఇండోర్ ప్లాంట్ గిఫ్ట్ గా ఇవ్వండి. మనీ ప్లాంట్, తులసి లేదా అలోవెరా రూ.100-150 లోపు దొరుకుతాయి. ఇది పర్యావరణానికి మంచిది. దీనికి థాంక్ యు నోట్ కూడా జత చేయండి.

48
3. మోటివేషనల్ కీచెయిన్

రూ.50-200 లోపు మోటివేషనల్ కీచెయిన్లు దొరుకుతాయి. ఉదా: Best Teacher, You Inspire Me వంటి కోట్స్ తో. ఇవీ మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ... మీ టీచర్లు వీటిని బ్యాగ్ లేదా కీస్ కి తగిలించుకోవచ్చు.

58
4. డైరీ

ఉపాధ్యాయులు డైరీని వాడుతుంటారు. నోట్స్ రాయడానికి లేదా వ్యక్తిగత విషయాలు రాయడానికి ఇది వారికి ఉపయోగపడుతుంది. రూ.150-200 లోపు డైరీలు దొరుకుతాయి. మొదటి పేజీలో థాంక్ యు మెసేజ్ రాసి మీ గురువుకు బహుమతి ఇవ్వండి.

68
5. చాక్లెట్ & థాంక్ యు కార్డ్

సింపుల్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే రూ.100 డైరీ మిల్క్ చాక్లెట్, రూ.50-60 థాంక్ యు కార్డ్ కొని గిఫ్ట్ ర్యాప్ చేసి ఇవ్వండి. ఇది మీ గురువులకి సంతోషాన్నిస్తుంది.

78
6. రుద్రాక్ష లేదా చందన మాల

గురువులకి పాజిటివ్ ఎనర్జీ కోసం రుద్రాక్ష లేదా చందనమాల మంచి గిఫ్ట్. రూ.200 లోపు చిన్న సైజు మాల దొరుకుతుంది. ఇది ఆధ్యాత్మికంగా మంచిది.

88
7. చేతితో తయారుచేసిన గ్రీటింగ్ కార్డ్

బడ్జెట్ చాలా తక్కువగా ఉంటే చేతితో గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇవ్వండి. చార్ట్ పేపర్, గ్లిటర్ పెన్, స్టిక్కర్స్ వాడి థాంక్ యు మెసేజ్ రాయండి. చేతితో తయారుచేసిన గిఫ్ట్స్ అందరికీ ఇష్టం.

Read more Photos on
click me!

Recommended Stories