శ్రావణ మాసంలో హిందూ మతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా శివుడిని , లక్ష్మీదేవిని ఆరాధించడానికి పవిత్రమైన కాలంగా పరిగణిస్తారు. శివయ్య ఆశీస్సులు పొందేందుకు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు కూడా పాటిస్తారు. ఈ నెల శ్రావణ నక్షత్రంతో ముడిపడి ఉంది. పెళ్లి కాని స్త్రీలు ఈ నెలలో ప్రత్యేక పూజలు ఆచరించడం ద్వారా మంచి భర్త వస్తారని కూడా నమ్ముతారు.ఇక వివాహిత స్త్రీలు తమ వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని, భర్త ఆయుష్షు కోసం ఈ నెలలో పూజలు చేస్తారు.
ఈ శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేసి, ఇంటికి తీసుకురావడం వల్ల.. ఆ ఇంటి కుటుంబ సభ్యులకు విజయం లభిస్తుందని నమ్ముతారు. మరి, ఎలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం...