క్యాన్సర్ రాకూడదంటే ఈ కూరగాయను తప్పక తినండి..

First Published | Nov 3, 2022, 2:54 PM IST

ఆరోగ్యంగా ఉండేందుకు మీ రోజు వారి ఆహారంలో ఎక్కువ కూరగాయలను చేర్చుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఆకుపచ్చని  కూరగాయ బ్రోకలీని ఖచ్చితంగా తినాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి మనల్ని రక్షిస్తుంది. 
 

నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతకాలంటే కూరగాయలను ఎక్కువగా తినాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆకుపచ్చని కూరగాయలు.  అందులో బ్రోకలీని ఖచ్చితంగా తినాలి. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, జింక్, కాపర్, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ కె లు బ్రోకలీలో పుష్కలంగా ఉన్నాయి.

న్యూట్రిషన్ రీసెర్చ్ నిర్వహించిన ఒక అధ్యయనంలో.. ఆవిరితో వండిన బ్రోకలీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని కనుగొన్నారు. యుఎస్ లో జరిపిన మరొక అధ్యయనం ప్రకారం.. కూరగాయలను.. ముఖ్యంగా బ్రోకలీ వంటి కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని కనుగొన్నారు.

Latest Videos


broccoli

ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆధారాలున్నాయి. బ్రోకలీలో సల్ఫోరాఫేన్ అని పిలువబడే ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. సిగరెట్ పొగ వంటి గాలిలోని విషాన్ని తటస్థీకరించడంలో సల్ఫోరాఫేన్ పాత్ర పోషిస్తుందని అలాగే  కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బ్రోకలీలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని  కొన్ని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 

బ్రోకలీలో కెరోటినాయిడ్లు, లుటిన్, జియాక్సంతిన్ లు ఉంటాయి. 2003, 2006 లో నిర్వహించిన అధ్యయనాల్లో.. ఈ కూరగాయ కంటిశుక్లం, మాక్యులర్ క్షీణత వంటి వృద్ధాప్య-సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొన్నారు. బ్రోకలీలో కంటిచూపును మెరుగుపరిచే బీటా కెరోటిన్ కూడా ఉంటుంది.

బ్రోకలీ వంటి కూరగాయలలో ఇండోల్-3-కార్బినాల్ (ఐ3సి) అని పిలువబడే మొక్కల సమ్మేళనం ఉంటుంది. ఇది మొక్కల ఈస్ట్రోజెన్ గా పనిచేస్తుంది. అలాగే ఈస్ట్రోజెన్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో  హార్మోన్లను సమతుల్యంగా ఉంటాయి. పురుషులు, మహిళలు ఇద్దరిలో ఈస్ట్రోజెన్ వల్ల కలిగే రొమ్ము, పునరుత్పత్తి క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.

బ్రోకలీ వంటి  కూరగాయలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాదు సంక్రమణకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని కూడా మెరుగుపడుతుంది. ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీ (OSU) పరిశోధకులు.. సల్ఫోరాఫేన్ ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలలో పొడవైన నాన్‌కోడింగ్ ఆర్‌ఎన్‌ఏల (lncRNAs) వ్యక్తీకరణను తగ్గించిందని కనుగొన్నారు. 

click me!