బాడీ పెయిన్స్ తో బాధపడుతున్నారా..? దీనికి కారణాలు ఇవే..!

First Published Sep 8, 2022, 1:45 PM IST

తరచుగా ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారా..? అయితే మీరు అనారోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నట్టే లెక్క.. బాడీ పెయిన్స్ వచ్చేవి ఇందుకే మరి.. 
 


కొంతమంది ఎప్పుడూ బాడీ పెయిన్స్ తో ఇబ్బంది పడుతుంటారు. అసలు ఇవి ఎందుకు వస్తాయన్న సంగతి చాలా మందికి తెలియదు. కానీ ఈ నొప్పులు ఏ పనులను చేయనీయవు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాడీ పెయిన్స్ ఎందుకు వస్తాయో తెలుసుకుందాం పదండి.  

నిద్రలేమి

మనం ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు పడుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఎందుకంటే నిద్రపోయేటప్పుడే శరీరం దాని  శక్తి వనరులను పునరుత్పత్తి చేసుకుంటుంది. అంతేకాదు  నిద్ర మనల్ని రీఫ్రెష్ గా చేస్తుంది కూడా. కానీ ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యలను ఫేస్ చేస్తున్నారు. దీనివల్ల శరీరం శక్తి వనరులను భర్తీ చేసుకోలేదు. దీనివల్ల బాడీ పెయిన్స్ వస్తాయి. 
 

డీహైడ్రేషన్

నిర్జలీకరణ కూడా బాడీ పెయిన్స్ కు దారితీస్తుంది. శరీరానికి అవసరమైన నీటిని తాగకపోవడం.. శరీరంలోంచి నీరు బయటకు పోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడతారు. దీనివల్ల అలసట, నొప్పి కలుగుతాయి. 
 

ఒత్తిడి

ఒత్తిడి మనల్ని శారీరకంగానే కాదు.. మానసికంగా కూడా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి ఎక్కువైతే శరీరం బాగా అలసిపోతుంది. దీంతో మీరు మరింత బలహీనంగా మారిపోతారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుంది.  దీంతో మీ శరీరం ఎన్నో రోగాలకు ఆవాసంగా మారుతుంది. ఇవన్నీ శరీర నొప్పులకు కారణం అవుతాయి. 

ఇనుము లోపించడం

రక్తంలో ఇనుము ముఖ్యమైన మూలకం. ఇది తక్కువ మొత్తంలో ఉండటం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు పోషకాలు, ఆక్సిజన్ సరిగ్గా అందవు. దీనివల్ల అలసటతో పాటుగా నొప్పి కూడా కలుగుతుంది. 
 

విటమిన్ డి లోపం

విటమిన్ డి మన శరీరం సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం. ఇది ఎముకలను, దంతాలను బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇది మన శరీరంలో లోపిస్తే కూడా శరీరం దీర్ఘకాలిక నొప్పిని ఎదుర్కొంటుంది. 
 

ఆర్థరైటిస్

ఆర్థరైటిస్ లేదా కీళ్ల వాపు సమస్యలు ఉంటే కూడా శరీరం నొప్పులు పుడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తగ్గించుకుంటే బాడీ పెయిన్స్ తగ్గుతాయి. 
 

జలుబు, ఫ్లూ

చలి, వానకాల్లో జలుబు, ఫ్లూ సమస్యలు సర్వసాధారణం. అయితే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా శరీర నొప్పులు కలుగుతాయి. 
 

click me!